Ajinkya Rahane : టెస్ట్ క్రికెట్ కి టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాస్తవానికి రోహిత్ శర్మ, కోహ్లీ, అశ్విన్ వీరు ముగ్గురు తొలుత రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా పుజారా రిటైర్మెంట్ ప్రకటించారు. ముఖ్యంగా పుజారా ఇంగ్లాండ్ టెస్ట్ కి ఎంపిక కాకపోవడంతోనే రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. కోహ్లీ, రోహిత్, పుజారా, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినా కానీ అజింక్య రహానే ఇంకా రిటైర్మెంట్ ప్రకటించడం లేదు ఎందుకు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం గమనార్హం.
Also Read : Arshdeep Singh : అర్ష్ దీప్ కోసం ఆ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. ఏకంగా 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కి
రహానే పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..
తాజాగా టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా ఇటీవలే క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కావడం ద్వారా తన కెరీర్ ను ముగించిన సంగతి తెలిసిందే. పుజారా భావోద్వేగంతో తన అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు అతను వ్యాఖ్యానంతో క్రికెట్ లో కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడని భావిస్తున్నారు. పుజారా తరువాత భారతదేశంలోని మరికొందరూ సీనియర్ ఆటగాళ్లు కూడా త్వరలో రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వీరిలో అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిలో అజింక్యా రహానే ను ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి అజింక్య రహానే పుజారాతో పాటు సమచర బ్యాట్స్ మెన్. రహానే కెరీర్ కూడా ప్రస్తుతం క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా 2011లో ఇంగ్లాండ్ పై ఆరంగేట్రం చేసిన రహానే ఇప్పటివరకు 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. చివరిసారిగా జులై 2023లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. 37 ఏళ్ల వయస్సులో కూడా అతను టీమిండియా కి తిరిగి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు.
రహానే సంచలన నిర్ణయం..
దాదాపు 37 ఏళ్ల పుజారా రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత రహానే ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ ముంబై క్రికెట్ దిగ్గజం అంజిక్య రహానే ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్ కు ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకొన్నాడు. ఈ సీనియర్ ప్లేయర్ నాయకత్వంలోనే 2023-24 రంజీ ట్రోఫీని ముంబై సొంతం చేసుకుంది. 2024లో ఇరానీ కప్ ను కూడా ముంబైకి అజింక్య రహానే అందించాడు. ముంబై జట్టుకు కొత్త నాయకుడిని తయారు చేసే సమయం ఆసన్నమైందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు రహానే. ముంబై కెప్టెన్ గా రహానే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2022-23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2022-23 దులీప్ ట్రోఫీ, 2023-24 రంజీ ట్రోఫీ వంటి టైటిల్స్ ను కెప్టెన్ గా రహానే గెలుచుకున్నాడు. రహానే ప్రస్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ సారథిగా ఉన్నాడు. గతంలో టీమిండియాకి వన్డే, టెస్టుల్లో, టీ-20లకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.