Big Stories

Yashasvi Jaiswal : సిక్సర్ తో సెంచరీ.. టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి నయా చరిత్ర..!

Yashasvi Jaiswal : విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ నయా చరిత్ర లిఖించాడు. అంతేకాదు 94 పరుగుల మీద ఉన్నప్పుడు హార్ట్ లీ వేసిన బంతిని ఫ్రంట్ ఫుట్ కి వచ్చి మరీ సిక్సర్ కొట్టాడు. నిజానికి సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు అంత రిస్కీ షాట్ అవసరమా? అని సీనియర్లు అంటున్నారు. ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇలాగే ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి అవుట్ అయిపోయాడు.

- Advertisement -

అయినా సరే, తనెక్కడా తగ్గలేదు. లాగిపెట్టి ఒకే ఒక సిక్సర్ కొట్టి, సెంచరీ పూర్తి చేయడంతో టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అంతకు మించి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ కూడా యశస్వి సెంచరీకి ఫిదా అయిపోయి చప్పట్లు కొట్టి తన అభినందనలు తెలిపాడు. 

- Advertisement -

ఇక జోరూట్ సైతం యశస్విని ప్రత్యేకంగా అభినందించాడు. ఎందుకంటే తన బౌలింగ్ లోనే యశస్వి అయిపోతుంటాడు.కానీ ఈసారి ఆ బలహీనతను అధిగమించాడు. 151 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ సాధించాడు.

ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 లో   రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక తన కెరీర్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత, ఆసియా ప్లేయర్‌గా రికార్డు అందుకున్నాడు. ఇక 6 టెస్ట్‌ల్లోనే 55.67 సగటుతో 500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడయ్యాడు. రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, యశస్వి జైస్వాల్.. 23 ఏళ్ల వయసులో స్వదేశంతో పాటు విదేశాల్లో శతకాలు నమోదు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News