New Proposal for Team India Head Coach : భారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ లో ఎవడు తుమ్మినా, దగ్గినా.. ఆ వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ప్రస్తుతం భారత్ క్రికెట్ హెడ్ కోచ్ పదవి విషయంలో రోజుకొక వార్త షికారు కొడుతోంది. ముఖ్యంగా గౌతంగంభీర్ హాట్ ఆఫ్ ది టాపిక్ గా నిలిచాడు. తన చుట్టూనే వార్తలన్నీ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కొహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ.. ఒక బాంబ్ పేల్చాడు.
అదేమిటంటే.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతంగంభీర్ కన్నా మహేంద్ర సింగ్ ధోనీ ఉంటే బెటర్ అని అన్నాడు. దీంతో ఈ మాట నిప్పులా రాజుకుని నెట్టింట మంట పుట్టిస్తోంది. ఎందుకంటే విరాట్ కొహ్లీ ఇంకా గౌతం గంభీర్ కి మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
అందువల్ల గంభీర్ కానీ కోచ్ గా వస్తే విరాట్ ఆట గతి తప్పుతుందా? తను సహకరిస్తాడా? లేదా? అనే సందేహాలు అప్పుడే నెట్టింట వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పుండు మీద కారం జల్లినట్టు.. ఎక్కడో దాక్కున్న చిన్ననాటి కోచ్ రాజేంద్రకుమార్ బయటకు వచ్చి.. అబ్బెబ్బే గంభీర్ వద్దు.. ధోనీ ముద్దు అంటూ మొదలెట్టాడు.
Also Read : ఆసీస్ మాజీ ఆటగాడు జోబర్న్స్, నా టాలెంట్ చూపిస్తా..
మరి ఇదెంత దూరం వెళుతుందో తెలీదు కానీ.. ఆ చిన్ననాటి కోచ్ మాత్రం కొంచెం లాజికల్ గానే మాట్లాడాడు. అది వింటే కరెక్టే అనిపిస్తుంది. ఇంతకీ తను ఏమన్నాడంటే.. ధోనీకి డ్రెస్సింగ్ రూమ్ లో చాలా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఆడుతున్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి వాళ్లందరూ ధోనీ టీమ్ లో జూనియర్లు. అందువల్ల ధోనీ చెప్పాడంటే, వాళ్లు చచ్చినట్టు వింటారు. అందులో మొహమాటమే లేదని అన్నాడు.
అంతేకాదు సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, హర్భజన్, కుంబ్లే, గంభీర్, యువరాజు ఇలా ఎంతోమంది ఉద్ధండ పిండాలతో జట్టుని ధోనీ సమర్థవంతంగా నడిపాడు. సక్సెస్ ఫుల్ సారథిగా నిలిచాడు. అలాగే ఐసీసీ ట్రోఫీలు తెచ్చాడు. ఈ సమయంలో తను అయితేనే కరెక్టు అని కుండబద్దలు కొట్టాడు.
ఈ మాట చూస్తే నిజమే అనిపిస్తుంది కానీ, ఇప్పుడు కాకపోయినా తర్వాతయినా ధోనీ టీమ్ ఇండియా కోచ్ గా రావడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే.. ప్రస్తుతం ధోనీ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ అయిన వెంటనే చికిత్స కోసం విదేశాలకు వెళుతున్నాడని తెలిపాడు. మరోవైపు ఎడతెగని క్రికెట్ ఆడటం వల్ల తను కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడని చెప్పాడు. అందుకని ధోనీని హెడ్ కోచ్ లిస్టులో నుంచి తీసేయవచ్చు. మరి గంభీర్ ని తీసేయాలా ? వద్దా? అన్నది బీసీసీఐ తేల్చాల్సిందే.