EPAPER

Newzealand Beats Srilanka : లంకను చిత్తుచేసిన కివీస్

Newzealand Beats Srilanka : లంకను చిత్తుచేసిన కివీస్

Newzealand Beats Srilanka : జట్టును ఒంటి చేత్తో గెలిపించడం అంటే ఎలా ఉంటుందో చూడాలంటే… T20 వరల్డ్ కప్ లో శ్రీలంకపై న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్ చూస్తే చాలు. 4 ఓవర్లలో 15 పరుగులకే 3 కీలక వికెట్లు పడిపోయిన దశలో… మిగతా బ్యాటర్లు క్రీజ్ లో నిలబడితే ఎక్కడ ఔటవుతారోననే ఆందోళనతో… నాన్ స్ట్రయికర్స్ కు పెద్దగా అవకాశం ఇవ్వకుండా… ఒక్కడే లంకను చితగ్గొట్టి కివీస్ ను గెలిపించాడు.. ఫిలిప్స్. ఈ వరల్డ్ కప్ లో నమోదైన రెండో సెంచరీ అతనిదే.


టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు… తొలి నాలుగు ఓవర్లలో లంక బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముగ్గురు లంక బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు. దాంతో… అసలు మనం చూస్తున్నది న్యూజిలాండ్ బ్యాటింగేనా అన్న అనుమానం వచ్చింది… అభిమానులకు. కానీ, ఆ తర్వాతే అసలు సిసలు మజా మొదలైంది. క్రీజ్ లోకి వచ్చింది మొదలు… బౌలర్ ఎవరన్నది చూడకుండా చితగ్గొట్టేశాడు… కివీస్ బ్యాటర్ ఫిలిప్స్. డాలిర్ మిచెల్ తో కలిసి మూడో వికెట్ కు 84 పరుగులు జోడించిన ఫిలిప్స్… ఆ తర్వాత వికెట్లు పడుతున్నా ఒత్తిడికి లోనుకాకుండా.. ఇన్నింగ్స్ చివరిదాకా ఆడి… సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 64 బంతుల్లోనే 4 సిక్సర్లు, 10 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్… మిగతా బ్యాటర్ల వైఫల్యాన్ని మరిపించింది. ఫిలిప్స్ విజృంభణతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది… న్యూజిలాండ్.

168 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక… కివీస్ బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే మొదలైన లంక వికెట్ల పతనం… ఎక్కడా ఆగలేదు. 8 పరుగులకే నలుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. వీరిలో ఇద్దరు డకౌట్. కాసేపు భానుక, షనక కవీస్ బౌలర్లను ఎదుర్కొన్నా… ఎక్కడా లక్ష్యం దిశగా సాగలేదు. వీళ్లిద్దరు మినహా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మొత్తం చేతులెత్తేయడంతో… 19.2 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది… శ్రీలంక. 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీసుకోగా… శాంట్నర్, సోథీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. టిమ్ ఫెర్క్యూసన్, సౌథీకి చెరో వికెట్ దక్కింది. ఇక సూపర్ సెంచరీ చేసిన ఫిలిప్స్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×