Namma Yatri App : క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్ కు… కర్నాటకలో అతి త్వరలో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఓలా, ఉబెర్ ఏకపక్ష దోపిడీకి విసిగిపోయిన కన్నడిగులు… రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేయడంతో… ఓలా, ఉబెర్ తో పాటు ర్యాపిడో ఆటో సేవల్ని కూడా నిలిపివేసింది… ప్రభుత్వం. ఆ తర్వాత బెంగళూరు ఆటో డ్రైవర్లు… నమ్మ యాత్రి పేరుతో సొంతంగా ఒక యాప్ రూపొందించుకున్నారు. లాంచ్ చేయకముందే నమ్మ యాత్రి యాప్ కు భారీ ఆదరణ లభించడం చూస్తుంటే… కచ్చితంగా అది సక్సెస్ అవుతుందనే చర్చ జరగుతోంది.
వచ్చే నవంబర్ 1 నుంచి నమ్మ యాత్రి యాప్ ద్వారా సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది… బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్. ఇప్పటికే ఈ యాప్ డౌన్ లోడ్స్ పది వేలు దాటి పోయాయి. కస్టమర్లపై భారం పడకుండా… డ్రైవర్లకు నష్టం రాకుండా… అందరికీ ఆమోదయోగ్యం అనిపించేలా నమ్మ యాత్రి ఛార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఛార్జిని ఖరారు చేశారు. పికప్, డ్రాప్ లొకేషన్‌లను బట్టి… దగ్గర్లోని ఆటో డ్రైవర్లు చార్జీని కోట్ చేస్తారు. పికప్, డ్రాపింగ్ దూరాన్ని బట్టి, అదనంగా 10 నుంచి 30 రూపాయల వరకు… అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ నమ్మ యాత్రిలో ఛార్జి వసూలు చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తామని… భవిష్యత్ లో వాలెట్, ఆన్ లైన్ చెల్లింపు సౌకర్యానీ అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు… నమ్మ యాత్రి డెవలపర్లు. ఓలా, ఉబెర్ కంటే నమ్మ యాత్రి చాలా బాగుందని ఇప్పటికే అనేక మంది ప్రశంసించారు. ఈ యాప్ సేవలు ప్రారంభమైతే… ఇంకెంత ఆదరణ పొందుతుందో చూడాలి.