Ranabali OTT Streaming:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం రణబాలి (Ranabali). పైగా వివాహం తర్వాత చేసిన తొలి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. రణబాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక మందన్న ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి ఈ సినిమాను థియేటర్లలో చూడడం మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే సినిమా థియేటర్లలో విడుదల అయ్యే ముందు చిత్ర బృందం ఏ రేంజ్ లో ప్రమోషన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే సినిమా ఓటీటీలోకి వచ్చే ముందు కూడా ఓటిటి ప్లాట్ఫామ్ అదే రేంజిలో ప్రమోషన్ చేస్తూ ఉంటుంది. అయితే అలాంటిది నెట్ ఫ్లిక్స్ పొరపాటున చేసిన ఒక పని అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటిది సడన్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఒక పోస్టు షేర్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. కానీ అప్పటికే నెటిజన్స్ ఆ పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసుకోవడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. అందులో నవంబర్ 13వ తేదీ నుండి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ALSO READ:అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!
మొత్తానికి అయితే నెలకులోపే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ పొరపాటు కారణంగా ఈ విషయం కాస్త లీక్ అయింది. మరి నవంబర్ 13వ తేదీ నుండి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తారా? లేక డేట్ వాయిదా వేస్తారా? అన్నది నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి విడుదలైన మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ మౌత్ టాక్ బాగుండడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హ్యాట్రిక్ అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.