Ambani’s Dog: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంటులో… ముంబై ఇండియన్స్ మొదట అత్యంత దారుణంగా విఫలమైంది. కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ పడి లేచిన కెరటంలా ముందుకు దూసుకు వెళ్తోంది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చింది. ఆడిన 11 మ్యాచ్ లలో మొత్తం ఏడు మ్యాచ్లో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. దీంతో 14 పాయింట్లు సాధించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. మొన్నటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ మొదటి స్థానానికి వచ్చింది.
Also Read: RCB Fans Cricket: పిచ్‌పై ఎవరైనా బౌలింగ్ చేస్తారు.. మరి నీటిపై? ఇతడి టాలెంట్‌కు దిమ్మతిరుగుద్ది
ముకేశ్ అంబానీ ఇంట విషాదం
ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ ఇంత తీవ్ర విషాదం నెలకొంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కి సంబంధించిన ఓ కుక్క మరణించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడిన ఆ కుక్క… మరణించడంతో ముఖేష్ అంబానీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కుక్క అంటే అనంత్ అంబానికి చాలా ఇష్టం. ఈ కుక్క కోసం ఎంతో ఖర్చు కూడా పెడుతున్నారు. దీనికి హ్యాపీ అనే పేరు కూడా పెట్టారు. ఎంతో గాఢంగా పెంచుకుంటున్న ఈ కుక్క మరణించడంతో… ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుక్కకు నివాళులర్పించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు
పాయింట్లు పట్టికలో మొదటి స్థానానికి ముంబై ఇండియన్స్ చేరడంతో… ప్లేయర్ లందరూ కలిసి నీతా అంబానీ కి ఫోన్ కాల్ చేశారు. కుక్క మరణించడంతో ఆమె రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ కు రాలేదు. ముంబైలోనే ఉండిపోయారు. అయితే… మ్యాచ్ అనంతరం మాత్రం మిగతా అంబానీ కి ఫోన్ చేసి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా తమ హ్యాపీ అనే కుక్క మరణించినట్లు నీతా అంబానీ చెప్పి ఎమోషనల్ అయ్యారు. అనంతరం హార్దిక్ పాండ్యాతో పాటు ముంబై ఇండియన్స్ ప్లేయర్ లందరూ.. రెండు నిమిషాల పాటు ఆ కుక్కకు నివాళులు కూడా అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంబానీ కుటుంబం పై విమర్శలు
అంబానీ ఇంట్లో కుక్క చనిపోతే… ముంబై ఇండియన్స్ ప్లేయర్ లందరూ నివాళులు అర్పించడం ఏంటని సెటైర్లు పేల్చుతున్నారు. ముంబై ఇండియన్స్ ప్లేయర్లను ఒక కుక్కలా మిగతా అంబానీ చూస్తోందని… ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అలాంటి జట్టులో టీమిండియా ప్లేయర్లు ఎవరూ కూడా ఉండకూడదని సూచిస్తున్నారు.
Also Read: Cricketers Cars: టీమిండియా క్రికెటర్ల కార్లు చూశారా… ఒక్కో కారు ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే
?igsh=eGhjeTcxMTVoNmtz