Smriti Mandhana: సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే టీ-20 సిరీస్ ని భారత్ 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లోనూ వరుసగా గెలుపొందిన భారత మహిళల జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని సొంతం చేసుకుంది. ఇక నేడు మూడవ వన్డే రాజ్కోట్ వేదికగా ప్రారంభమైంది.
Also Read: Virat Anushka New Home: విరాట్ కోహ్లీ ఇంట శుభకార్యం.. గ్రాండ్ గా ఏర్పాట్లు !
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత మహిళా క్రికెటర్లు పతంగులను ఆకాశంలోకి ఎగురవేస్తూ సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఐర్లాండ్ మహిళా జట్టు కూడా భారత మహిళా క్రికెటర్లతో కలిసి కైట్స్ ని ఎగరవేస్తూ సందడి చేశారు. అనంతరం మూడవ వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కి దిగిన భారత ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతీక రావల్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
ఈ మ్యాచ్ లో కెప్టెన్ స్మృతి మందాన సెంచరీతో చెలరేగిపోయింది. 70 బంతుల్లో 100 పరుగులు సాధించి అత్యంత వేగంగా సెంచరీ చేసిన మహిళ క్రికెటర్ గా చరిత్రకెక్కింది. అంతేకాకుండా తన అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఓ అరుదైన రికార్డు ని తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్ లో 500 కు పైగా బౌండరీలు బాదిన రెండవ భారత మహిళా బ్యాటర్ గా రికార్డ్ నమోదు చేసింది స్మృతి మందాన. ఇది మాత్రమే కాకుండా వన్డే క్రికెట్ లో పది సెంచరీలు చేసిన తొలి ఆసియా మహిళగా నిలిచింది.
భారత క్రికెట్లో తిరుగులేని రాణిగా అవతరించింది స్మృతి మందాన. ఇక 26వ ఓవర్ నాలుగవ బంతికి స్మృతి మందాన.. ఓర్లా ప్రెండర్గస్ట్ బౌలింగ్ లో వెనుతిరిగింది. ప్రస్తుతం 36 ఓవర్లకు 332 పరుగులు చేసిన భారత్ ఒక వికెట్ కోల్పోయింది. ప్రతికా రావల్ (118*), రీచా గోష్ (55*) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read: Jasprit Bumrah: కమిన్స్ కు బిగ్ షాక్.. బుమ్రాకు మరో అవార్డు !
స్మృతి మందాన తన కెరీర్ లో ఇప్పటివరకు 96 వన్డేలు ఆడి.. 45.26 యావరేజ్ తో 4,074 పరుగులు చేసింది. ఇందులో 10 సెంచరీలు, 30 హౌస్ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 136. అలాగే ఏడు టెస్టుల్లో 57.18 యావరేజ్ తో 629 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టి-20 ల విషయానికి వస్తే 148 మ్యాచుల్లో 29.38 యావరేజ్ తో 3,761 పరుగులు చేసింది. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
🔹 First Asian woman to smash 10 centuries in ODI cricket
🔸 Fourth-most centuries in Women’s ODIsSmriti Mandhana – undisputed queen of Indian cricket! 👑🇮🇳#Cricket #ODI #SmritiMandhana #India pic.twitter.com/TGFyZpCPLq
— Sportskeeda (@Sportskeeda) January 15, 2025