Pakistan cricketer Azam Khan Died: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెను విషాదం చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ యంగ్ క్రికెటర్, 28 ఏళ్ల వికెట్ కీపర్ ఆజం ఖాన్ మృతి చెందినట్టు వార్తలు వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ టీవీ చానల్స్ లో కూడా ప్రసారమైంది. దీంతో నిజంగానే ఆజం ఖాన్ మృతి చెందాడని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఆజం ఖాన్ చనిపోలేదు. అదంతా ఫేక్ న్యూస్. ఈ విషయాన్ని స్వయంగా ఆజం ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. టీవీలలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూపించి మరీ, నేను చావలేదు రా అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
నిన్న కూడా పాకిస్తాన్ లో అదిరిపోయే మ్యాచ్ ఆడాను… బ్యాటింగ్ కూడా అదరగొట్టాను.. ఎవర్రా మీకు చెప్పింది నేను చనిపోయాను? అని ప్రశ్నిస్తూ ఓ వీడియోలు రిలీజ్ చేశారు ఆజం ఖాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టీవీల్లో వచ్చిన వార్త ఫేక్ అని గుర్తించారు. ఈ క్రమంలో టీవీ చానల్స్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 130 కిలోల దిట్టమైన మనిషి చనిపోయాడని ఎలా లైవ్ టెలికాస్ట్ చేస్తారు అంటూ నిలదీస్తున్నారు. ఇది నిజం? ఏది ఫేక్ అని తెలియడం లేదా…? బతికున్న మనిషిని చంపారు కదరా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆజం ఖాన్ పేరుతోనే పాకిస్తాన్ లో మరొక వ్యక్తి మృతి చెందాడు. అతని ఫోటోలు వాడకుండా క్రికెటర్ ఆజామ్ ఖాన్ ఫోటోలు వేసి జనాలను కన్ఫ్యూజ్ చేశాయి టీవీ చానల్స్. 2022లో పాకిస్తాన్ కు సంబంధించిన ప్రముఖ స్క్వాష్ లెజెండ్ ఆజం ఖాన్ తన 95 యేటా కరోనా వైరస్ కారణంగా లండన్ లో మృతి చెందారు. కొంతమంది యూజర్లు పాత వార్తను.. ఇప్పుడు ప్లే చేసి జనాలను కన్ఫ్యూజ్ చేశారు. ముందుగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వదలగా.. అదే నిజమనుకొని మినిస్ట్రీ మీడియా కూడా వార్తలను టెలికాస్ట్ చేసింది. ఇక్కడే జనాలంతా పిచ్చోళ్ళు అయ్యారు.
పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ ఆజం ఖాన్ ఫిట్నెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి.ఆజం ఖాన్ దాదాపు 130 కేజీలు ఉంటారు. చాలా లావుగా కనిపించిన నేపథ్యంలో అతన్ని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. వికెట్ కీపింగ్ కూడా సరిగ్గా చేయడని విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అతని పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి పెట్టారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ తో పాటు దేశ వాలి క్రికెట్లలో ప్రాతినిధ్యం వహిస్తూ రాణించే ప్రయత్నం చేస్తున్నాడు.