National Champions Cup 2026: 2027 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించేందుకుగాను పాకిస్తాన్ అదిరిపోయే ప్లాన్ చేసింది. తమ జట్టు ప్లేయర్లను నాలుగు జట్లుగా డివైడ్ చేసి నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 టోర్నమెంట్ ( National Champions Cup 2026/27) నిర్వహిస్తోంది. నిన్నటి నుంచి ఈ మెగా టోర్నమెంట్ షురూ అయింది. అయితే, ఈ టోర్నమెంట్ ఆడుతున్న పాకిస్తాన్ క్రికెటర్లు నరకం చూస్తున్నారు. ముల్తాన్ వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో, ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజూ 60 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ఈ టోర్నమెంట్ ఆడలేక ఇబ్బంది పడుతున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు. ఈ క్రమంలో షాబాద్ ఖాన్, హసన్ అలీ లాంటి క్రికెటర్లు వడదెబ్బకు కుప్పకూలారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026 టోర్నమెంట్ (National Champions Cup 2026/27) నిన్న ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ ఆగస్టు 18 వరకు జరగనుంది. కేవలం ముల్తాన్ క్రికెట్ అంతర్జాతీయ స్టేడియం ( Multan Cricket Stadium) వేదికగానే ఈ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ఈ ముల్తాన్ వేదికగా ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు 50 నుంచి 60 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో క్రికెటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ గ్రీన్స్ జట్టు కెప్టెన్ షాబాద్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీనివల్ల మ్యాచ్ మధ్యలోనే అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం పాకిస్తాన్ బ్లూస్ ఆటగాడు హసన్ అలీ కూడా మైదానంలో ఆడుతున్న సమయంలో తీవ్రమైన హైడ్రేషన్ కు గురయ్యాడు. దీంతో కాసేపు మ్యాచ్ ఆపేసి, అతనికి ట్రీట్మెంట్ అందించారు. ఇలా వరుసగా కీలక ప్లేయర్ లందరూ వడదెబ్బకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము ఈ టోర్నమెంట్ ఆడబోమని పలువురు క్రికెటర్లు..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలకు కూడా స్పష్టం చేస్తున్నారట.
పాకిస్తాన్ లో ఆగస్టు వచ్చిందంటే చాలా ఎండలు కొడతాయి అన్న సంగతి తెలిసిందే. ఈ ఆగస్టును పీక్ సమ్మర్ సీజన్ గా చెబుతూ ఉంటారు. ముల్తాన్ లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం తెలిసి కూడా ఇక్కడే మ్యాచ్ లు అన్నీ కూడా నిర్వహించడం పట్ల అభిమానులు ఫైర్ అవుతున్నారు. PCB ఛైర్మన్ నఖ్వీకి కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా.. చల్లటి వాతావరణం ఉండే రావలపిండి లేదా అబౌట్ వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే బాగుండేదని సూచనలు చేస్తున్నారు.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు