Shoaib Akhtar Rejected PCB offer: పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఇలాంటి తరుణంలో షోయబ్ అక్తర్ ను బరిలోకి దించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే, షోయబ్ అక్తర్ ను కలిసి, మొహ్సిన్ నఖ్వీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. షోయబ్ అక్తర్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక పదవి ఇచ్చేందుకు మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. కానీ ఈ పదవిని సున్నితంగా షోయబ్ అక్తర్ తిరష్కరించినట్టు పాకిస్తాన్ సోషల్ మీడియాలోనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మొహ్సిన్ నఖ్వీ ఉండగా తానేమీ పదవి తీసుకోబోనని కుండ బద్దలు కొట్టి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న తరుణంలో షోయబ్ అక్తర్ కాళ్ల దగ్గరకు మొహ్సిన్ నఖ్వీ వెళ్లాడు. ఇస్లామాబాద్ లో ఉంటున్న షోయబ్ అక్తర్ ఇంటికి వెళ్లి, ప్రత్యేకంగా సమావేశం అయ్యారు నఖ్వీ. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు కోసం పని చేయాలని కోరారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్, పీసీబీ సలహాదారులు, మెంటార్ గా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
అవసరం అనుకుంటే, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా చేస్తామని షోయబ్ అక్తర్ కు బంపర్ ఆఫర్లు ఇచ్చారట నఖ్వీ. ఏదో ఒక పదవి తీసుకుని, పాకిస్తాన్ క్రికెట్ కాపాడాలని ప్రాధేయ పడినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అటు యూనిస్ ఖాన్ ను కూడా ఇదే విధంగా నఖ్వీ కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇస్లామాబాద్ లో షోయబ్ అక్తర్ ను కలిసి నఖ్వీ బంపర్ ఆఫర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నఖ్వీ ఇచ్చిన ఆఫర్లు విని, సింపుల్ గా షోయబ్ అక్తర్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా నఖ్వీ ఉన్నన్ని రోజులు తాను ఏ పదవి తీసుకోబోనని అతడి ముఖం మీదే చెప్పేశాడట. కాళ్లు పట్టుకున్నా, నఖ్వీ ఆఫర్ కు ఒప్పుకునేది లేదంటూ కుండ బద్దలు కొట్టి చెప్పారట అక్తర్. ట్రోఫీలు చోరీ చేసే వాడి కింద తాను పని చేయబోనని గతంలో కూడా షోయబ్ అక్తర్ వెల్లడించారు. అటు యూనిస్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారట. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తన బాధ్యతల నుంచి తప్పుకుంటేనే, ఈ మాజీలు రంగంలోకి దిగుతారన్న మాట.