E-Paper
Advertisement

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది
Advertisement

West Indies jersey sponsor Controversy:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న తిరువనంతపురం వేదికగా తొలి వన్డే జరగగా అద్భుతంగా రాణించిన టీమిండియా… విక్టరీ అందుకుంది. అయితే ఈ తరుణంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు గురించి షాకింగ్ నిజం బయటకు వచ్చింది. భారత పర్యటనకు రాకముందు వెస్టిండీస్ జట్టుకు వన్డే జెర్సీ స్పాన్సర్ గా ఎవరు లేరట. ఎప్పుడైతే భారత పర్యటనకు వచ్చిందో.. వెంటనే వెస్టిండీస్ జట్టుకు ఊపిరి పోస్తూ… స్పాన్సర్ కంపెనీ దొరికినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నా యి. వెస్టిండీస్ జెర్సీ స్పాన్సర్ గా లీవ్ ప్యూర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

కోట్లల్లో డబ్బులు ఇచ్చి మరీ… స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకుందట లివ్ ప్యూర్ కంపెనీ. దీంతో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. భారత జట్టుతో వన్డే సిరీస్ ఫిక్స్ అయిన నేపథ్యంలోనే ఈ ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఇండియా తో సిరీస్ ఎఫెక్ట్ కారణంగానే ఈ స్పాన్సర్షిప్ వెస్టిండీస్ జట్టుకు దక్కింది అన్నమాట. ఈ క్రమంలో బీసీసీఐ అటు టీమిండియాను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. భారత శక్తి ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిందని కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

అదంతా ఫేక్ ప్రచారమే.. విండీస్ క్లారిటీ!

భారత పర్యటనకు వచ్చిన తర్వాత క్రికెట్ వెస్టిండీస్ తో లీవ్ ప్యూర్ సంస్థ స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వస్తున్న వార్తలపై తీవ్ర దుమారం పెరిగింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ అంశం ఫేక్ అంటూ విండీస్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన కొంతమంది అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2026 లోనే ఆ కంపెనీ వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

 

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా లివ్ ప్యూర్ కంపెనీయే స్పాన్సర్ గా ఉంది అని స్పష్టం చేశారట. ప్రస్తుత భారత పర్యటన సందర్భంగా కూడా అదే కంపెనీ స్పాన్సర్ గా ఉన్నట్లు వెల్లడించారని సమాచారం. అయితే స్వదేశంలో జరిగిన సిరీస్ లలో ఈ కంపెనీ పేరు బయటకు రాకపోవడంతో… తప్పుడు ప్రచారం వైరల్ అవుతోందని వెస్టిండీస్ అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ సమాచారాన్ని ఎవరు నమ్మకూడదని వెస్టిండీస్ అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న తిరువనంతపురం వేదికగా తొలి మ్యాచ్ లో  వెస్టిండీస్ పై 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

 

 

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

 

 

Tags

Related News

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

బస్సు దిగుతుండగా బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ… పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ?

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

Big Stories

Advertisement
×