Temba Bavuma Vs Quinton de Kock DRS clash : ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో నిన్న రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టులో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. DRS విషయంలో ప్లేయర్లు, కెప్టెన్ తెంబా బవుమా మధ్య గొడవ జరిగినట్టు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా కెప్టెన్ తెంబా బవుమా అంటే గౌరవం లేకుండా, చాలా చీప్ గా క్వింటన్ డికాక్ (Quinton de Kock) వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఒరేయ్ పొట్టాడా ? అంటూ బవుమాను కించపరిచినట్టు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నిన్న రెండో వన్డే జరిగింది. జోహన్నస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం వేదికగా, ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలోనే తెంబా బవుమా, క్వింటన్ డికాక్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై మరొకరు బండ బూతులు తిట్టుకున్నారు. దీనికి డీఆర్ఎస్ రివ్యూ కారణం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో కంగారు ప్లేయర్ జేవియర్ బార్ట్లెట్ (Xavier Bartlett) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ తరుణంలోనే సౌతాఫ్రికా బౌలర్ లిజాడ్ విలియమ్స్ వేసిన బంతి దెబ్బకు జేవియర్ బార్ట్లెట్ (Xavier Bartlett) వికెట్ల ముందు దొరికాడు. అయితే, డీఆర్ఎస్ తీసుకోవాలని లిజాడ్ విలియమ్స్ ఒత్తిడి చేయగా, అటు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం వద్దని వారించాడు. కానీ క్వింటన్ డికాక్ మాట కాదని బౌలర్ చెప్పినట్టు రివ్యూకు వెళ్లాడు కెప్టెన్ తెంబా బవుమా. ఈ క్రమంలో తన మాట వినలేదని బవుమాను అవమానిస్తూ మాట్లాడాడు. అటు కెప్టెన్ తెంబా కూడా రెచ్చిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే, ఈ DRSలో జేవియర్ బార్ట్లెట్ ఔట్ అని తేలింది. దీంతో సౌతాఫ్రికాకు వికెట్ దక్కింది. ఈ అవమానంతో డ్రెస్సింగ్ రూంకు కోపంతో డికాక్ వెళ్లిపోయాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma ) సెంచరీతో ఇరగదీశాడు. 116 బంతుల్లోనే 103 పరుగులతో రాణించాడు. అటు మిల్లర్ కూడా 142 పరుగులతో ఇరగదీశారు. ఈ క్రమంలో 50 ఓవర్లలో 365 పరుగుతు సాధించింది సౌతాఫ్రికా. ఈ టార్గెట్ ఛేదించే క్రమంలోనే విఫలమైన ఆస్ట్రేలియా, 333 పరుగులకే కుప్పకూలింది. దీంతో 32 పరుగుల తేడాతో విక్టరీ సౌతాఫ్రికా అందుకుంది.