E-Paper
Advertisement

బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే
Advertisement

Harbhajan singh On Ind Vs Ban:  బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా ( Bangladesh vs. Team India) మధ్య వన్డే తో పాటు టి20 సిరీస్ కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ పెద్దలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ మాసంలో ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే బీసీసీఐకి లేఖ రూపంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ మాత్రం లేఖ రాసినట్లు తెలుస్తోంది బీసీసీఐ.

బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా శ‌త్రువులే

బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా మధ్య టి20 తో పాటు వన్డే సిరీస్ కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ( Harbhajan Singh) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యవహరించిందని మండిపడ్డారు. అలాంటి వాళ్లతో క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ తరహా లోనే ట్రీట్ చేయాలని.. వాళ్లను శత్రువులుగా భావించాల్సిందేనని స్పష్టం చేశారు హర్భజన్ సింగ్. ఇండియా వ్యతిరేక సెంటిమెంట్లను బంగ్లాదేశ్ ప్రోత్సహిస్తుందని ఆగ్రహించారు. పాకిస్తాన్ లాగానే… ఇండియాను కించపరిచేలా బంగ్లాదేశ్ వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ తో మ్యాచ్లను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

బంగ్లాదేశ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఇకపై వద్దు

పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేసుకున్నట్లుగానే.. బంగ్లాదేశ్ తో కూడా రద్దు చేసుకోవాలని హర్భజన్ సింగ్ డిమాండ్ చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్థాన్ మాటలు విన్న బంగ్లాదేశ్.. ఇప్పుడు మళ్లీ టీమిండియా కాళ్ళ దగ్గరికి వచ్చిందని ఆగ్రహించారు. అప్పుడు ఇండియా సేఫ్టీ కాదన్నా బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే తో పాటు టి20 సిరీస్ ప్రతిపాదన ఎందుకు తీసుకువచ్చిందని నిలదీశారు.

Advertisement

ఇండియాతో ఆడకపోతే బంగ్లాదేశ్ రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించి, ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు హర్భజన్ సింగ్. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ను తన్ని తరిమేసినట్లే.. బంగ్లాదేశ్ ను కూడా ఫుట్బాల్ ఆడుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రతి ఒక్కడికి ఇండియా అంటే ఏంటో అర్థం అవుతుందని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా.. సెప్టెంబర్ లో టీ20లతో పాటు వన్డేలు నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనలు తయారు చేయగా.. బీసీసీఐ మాత్రం ట్విస్ట్ ఇచ్చింది. ఈ సెప్టెంబర్ లో ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టి20 ఆడేందుకు సిద్ధమైంది. షెడ్యూల్ కూడా అనౌన్స్ చేసింది.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

Related News

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

బస్సు దిగుతుండగా బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ… పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ?

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

Big Stories

Advertisement
×