Olympic Medal Rust: 2024 ఒలింపిక్స్ పారిస్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. గతంలో 1900, 1924 సంవత్సరాలలో పారిస్ వేదికగా ఈ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి. 2024 లో మూడోసారి పారిస్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలు నాలుగున్నర సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. దాదాపు మూడు వారాలపాటు సాగిన ఈ ఉత్కంఠభరితమైన పారిస్ ఒలంపిక్స్ గేమ్స్ జూలై 26 నుండి ప్రారంభమై.. ఆగస్టు 11వ తేదీన ముగిశాయి.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ప్రాణాలకే ముప్పు..పాకిస్థాన్ వెళ్లొద్దు అంటూ ఫ్యాన్స్ రచ్చ !
ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మెడల్స్ గెలుచుకున్నారు. ఈ ఒలంపిక్ పోటీలలో పాల్గొనేందుకు క్రీడాకారులు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి వివిధ క్రీడా విభాగాలలో పోటీపడతారు. ఈ మెడల్ అత్యంత విలువైనది అలాగే ప్రదర్శనలో అత్యుత్తమమైనది. ఈ ఒలంపిక్స్ విజేతలకు ఒలంపిక్స్ అసోసియేషన్ మూడు రకాల బహుమతులను ప్రధానం చేస్తుంది. మొదటి స్థానం పొందిన క్రీడాకారులకు స్వర్ణం, రెండవ స్థానం పొందిన క్రీడాకారులకు రజతం, మూడవ స్థానం సాధించిన వారికి కాంస్య పథకాలను అందిస్తారు.
అయితే ఈ ఒలంపిక్స్ క్రీడలు ముగిసి ఏడాది కూడా గడవకుండానే చాలా వరకు పథకాలపై ఉన్న లోహపు పూత చెదిరిపోయింది. దీంతో పారిస్ ఒలంపిక్స్ లో పథకాలు గెలిచిన 100 మంది అథ్లెట్లు వారు గెలుచుకున్న పథకాలను వాపస్ చేశారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి గెలిచిన పథకాలను తిరిగి ఇచ్చేశారు. తమకు అందజేసిన పథకాలు దారుణంగా పాడైపోయాయని వారు వాపోతున్నారు. మెడల్స్ పై ఉన్న లోహపు పూత చెదిరిపోయిందని పథకాలను తిరిగి ఇచ్చేశారు.
దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ స్పందించింది. నాణ్యతలేని 2024 ఒలంపిక్ పథకాలను మార్చి కొత్తవి ఇస్తామని ఓ ఆంగ్ల వార్త సంస్థకి వెల్లడించింది. ది పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ నిర్వాహక కమిటీ ఫ్రెంచ్ ప్రభుత్వ మెంట్ తో కలిసి పనిచేస్తుంది. ఆ సంస్థ ఈ పథకాల తయారీ, నాణ్యతకు బాధ్యత వహిస్తుంది. ఈ క్రమంలో మెడల్స్ పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి.. నాణ్యతలేని వాటిని ఫ్రెంచ్ ప్రభుత్వ మెంట్ రీప్లేస్ చేస్తోంది.
ఈ ప్రక్రియ మరికొద్ది వారాల్లో ప్రారంభం కాబోతుందని ఆ సంస్థ వివరించింది. ఈ పథకాలు లోపాభూయిష్టంగా ఉన్నట్లు వస్తున్న విమర్శలపై ఫ్రెంచ్ ప్రభుత్వమేంట్ తిప్పికొట్టింది. గత సంవత్సరం ఆగస్టు నుంచే నాసిరకంగా ఉన్న పథకాలను మార్చి ఇచ్చినట్లు తెలిపింది. ఈ 2024 ఒలింపిక్స్ లో 5,084 స్వర్ణ, రజత, కాంస్య పథకాలను అథ్లెట్లకు అందజేశారు. గోల్డ్ మెడల్ ని వెండితో రూపొందిస్తారు.
Also Read: Tilak Varma – Vijay Devarkonda: టాలీవుడ్ హీరోతో తిలక్ వర్మ.. విదేశాల్లో చిల్ !
దీనిపై బంగారు పూత పూస్తారు. అందులో 92.5 శాతం వెండి ఉండగా.. 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తారు. 2024 పారిస్ ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ విలువ రూ. 62 వేల నుండి 71 వేల వరకు ఉంటుంది. ఇక పూర్తిగా వెండితో తయారుచేసిన పథకం విలువ సుమారు 37 వేల వరకు ఉంటుంది. అలాగే కాంస్య పథకంలో 95% రాగి ఉంటుంది. ఇందులో 5% జింక్ కలుపుతారు. దీని విలువ రూ.500 ఉంటుంది.