Tilak Varma – Vijay Devarkonda: భారత క్రికెట్ జట్టు డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు సంవత్సరాల క్రితం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాది.. కొంతకాలంగా టీమ్ లో పర్మినెంట్ బెర్త్ ని సాధించలేకపోతున్నాడు. జట్టులోకి అడపాదడపా వస్తూ వెళ్తున్నాడు. తిలక్ వర్మ ఓ సిరీస్ లో రాణిస్తే.. మరో సిరీస్ లో ఫెయిల్ కావడం, కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయలేకపోవడం అతడికి మైనస్ గా మారింది.
ALSO READ: Bumrah vs Jaiswal: కెప్టెన్సీ కోసం కొట్టుకుంటున్న బుమ్రా, జైశ్వాల్ ?
భారీ ఇన్నింగ్స్ లు ఆడక పోవడం కూడా అతడికి ఓ నెగిటివ్ అనే చెప్పాలి. తిలక్ వర్మ హైదరాబాద్ కి చెందిన ఓ సాధారణ ఎలక్ట్రిషన్ కొడుకు. అతడు ఇప్పుడు భారత జట్టుకు ప్రతినిత్యం వహించే స్థాయికి చేరుకున్నాడంటే.. అతడి ప్రయాణం ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అతడు క్రికెట్ కిట్ కొనాలనుకున్నా కూడా అప్పు చేయాల్సిన విధంగా ఉండేది అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి. అక్కడినుండి మొదలైన తిలక్ వర్మ ప్రస్థానం.. ఇప్పుడు స్టార్ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడే స్థాయికి ఎదిగాడు.
అతడికి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని కాదనలేక తిలక్ తండ్రి నాగరాజు అప్పు చేసి మరీ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అతని తల్లిదండ్రులు చిన్నచిన్న కాంట్రాక్టుల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని కూడా తిలక్ బంగారు భవిష్యత్తు కోసమే ఖర్చు చేశారు. తిలక్ టాలెంట్ ని గుర్తించిన కోచ్ యాష్.. అతని ఇంట్లోనే ఆసరా కల్పించి ప్రత్యేక కోచింగ్ ఇప్పించారు. ఓ రకంగా చెప్పాలంటే తిలక్ వర్మ ఖర్చులన్నీ కోచ్ యాష్ భరించారు. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న తిలక్ వర్మ నేడు ఓ గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు. ఇటీవల టీ-20 ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు.
అయితే తిలక్ వర్మని ఎంతో మంది ఇష్టపడతారు. ఇందులో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. గతంలో చాలా సార్లు విజయ్ దేవరకొండ తిలక్ వర్మపై ప్రశంసాలో వర్షం కురిపించారు. 2024 నవంబర్ లో భారత జట్టు సౌతాఫ్రికా తో నాలుగు టి-20 మ్యాచ్ ఇలా సిరీస్ ని ఆడింది. ఈ సిరీస్ ని భారత జట్టు 3 -1 తో కైవసం చేసుకుంది. చివరి టి20 లో తిలక్ వర్మ 47 బంతులలో 120 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ నీ మ్యాచ్ లో విజయం సాధించడమే కాక సిరీస్ నీకు అయివసం చేసుకుంది.
ALSO READ: Uthappa on Virat Kohli: అంబటి రాయుడును తొక్కేసింది కోహ్లీనే..2019 లో ఇదే జరిగింది !
ఆ సందర్భంలో తిలక్ ని ప్రశంసిస్తూ విజయ్ దేవరకొండ ఓ స్టోరీని పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే తాజాగా తిలక్ వర్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండతో కలిసి అతడు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఫోటోని షేర్ చేశాడు. “మిమ్మల్ని ఫ్లైట్ లో కలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం. మళ్లీ కలుద్దాం” అని ఫోటో పై రాసుకొచ్చారు. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tilak Varma’s flight journey became a special one as he bumped into South Indian actor, Vijay Deverakonda 😍🏏
📷:- Tilak Varma/ Instagram #TilakVarma #VijayDeverakonda #Indiancricket #Insidesport #CricketTwitter pic.twitter.com/X4N5GojKNC
— InsideSport (@InsideSportIND) January 14, 2025