Manchu Lakshmi: మంచు మోహన్ బాబు(Mohan Babu) వారసురాలిగా మంచు లక్ష్మీ ప్రసన్న (Lakshmi Prasanna)అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె కూడా మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు.. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ లక్ష్మీ ప్రసన్న తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశాను అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.. ఇటీవల అహ్మదాబాద్ లో సుమారు 250 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయినా సెకండ్ల వ్యవధిలోనే ఒక బిల్డింగ్ పై కూలిపోయిన విషయం తెలిసిందే.
హృదయ విదారక ఘటన…
ఇలా ఈ ప్రమాదంలో ఒకరు మినహాక మిగిలిన అందరూ ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఈ విమానం పడటంతో కాలేజీ హాస్టల్ లో భోజనం చేస్తున్న విద్యార్థులు కూడా సుమారు 24 మంది వరకు మరణించారని తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను ఎంతగానో కలిసి వేసింది. అయితే ఈ విమానంలో మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు బయటకు రావడంతో ఈ వార్తలపై మంచు లక్ష్మి స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
క్షేమంగా ఉన్నాను..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను పర్సనల్ గా అందరికీ మెసేజ్ లు చేశాను, అలాగే స్టోరీ కూడా షేర్ చేశానని, నేను నా కూతురు క్షేమంగా ల్యాండ్ అయ్యాము అంటూ మంచు లక్ష్మి తెలిపారు. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో నిన్న ప్రయాణం చేశానని అయితే తాను ముంబైకి వెళ్లానని మంచు లక్ష్మి తెలిపారు.. తాను భగవంతుడి దయవల్ల ముంబైలో క్షేమంగా ల్యాండ్ అయ్యానని తెలియజేశారు. ఈ విషయం గురించి చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని, అయితే మీ అందరి ప్రేమ వల్ల తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. ఇకపోతే ఈ విమాన ప్రమాదం గురించి కూడా ఈమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారందరి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని తెలియజేసారు.
ఏ క్షణం ఏం జరుగుతుందో..
ఈ సంఘటన గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుందని, ఆ విమానం వెళ్లి హాస్టల్ భవనం పై పడటం అక్కడ ఉన్నటువంటి మెడికోస్ చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులు ఎలా జీర్ణించుకున్నారో అర్థం కావడం లేదు అంటూ ఈ విమానం ప్రమాదం గురించి ఆవేదన చెందారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరు కూడా మీ గురించి జాగ్రత్తలు తీసుకోండని తెలియజేశారు. ఇలా మంచు లక్ష్మి కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశారని, అయితే తాను ముంబైకి వెళ్లానని తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వీడియో ద్వారా ఈమె క్లారిటీ ఇచ్చారు.