Oshane Thomas: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) 11వ ఎడిషన్ డిసెంబర్ 30వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 30 సోమవారం రోజున డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫార్చున్ బరిషల్ – దర్బార్ రాజ్ షాహి మధ్య మొదటి మ్యాచ్ తో ఈ 11వ సీజన్ ప్రారంభమైంది. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. చిట్టగాంగ్ కింగ్స్, ఢాకా క్యాపిటల్స్, ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్, రంగ్ పూర్ రైడర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్, దర్బార్ రాజ్ షాహి జట్లు పోటీ పడబోతున్నాయి.
Also Read: Nitish Kumar – Bumrah: MCG లో నితీష్, బుమ్రాకు అరుదైన గౌరవం.. వీడియో వైరల్ !
ఈ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 7న జరగబోతోంది. అయితే ఈ సీజన్ లోని 3వ మ్యాచ్ ఖుల్నా టైగర్స్ – చిట్టగాంగ్ కింగ్స్ మధ్య 31వ తేదీ మంగళవారం రోజు జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఖుల్నా బ్యాటర్లలో బొసిస్టో 50 బంతులలో 75 పరుగులు {Oshane Thomas} చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఈ 75 పరుగుల లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఇక మరో బ్యాటర్ మహిదుల్ ఇస్లాం అంకోన్ 22 బంతులలో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 1 ఫోర్, ఆరు సిక్సర్లతో మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఇక కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 18, మహమ్మద్ నయీమ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6, అఫీఫ్ హుస్సేన్ 8 పరుగులతో రాణించారు. ఇక చిట్టగాంగ్ బౌలర్లలో అలీస్ అల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
కాగా 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన చిట్టగాంగ్ టీమ్ 18.5 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. చిట్టగాంగ్ బ్యాటర్లలో షమీమ్ హుస్సేన్ 78 పరుగులతో ఒంటరి పోరు చేసినా ఫలితం దక్కలేదు. ఇక ఖలీల్ అహ్మద్ 14, ఉస్మాన్ ఖాన్ 18, పర్వీజ్ హుస్సేన్ 13, నయీమ్ 12 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. ఖుల్నా బౌలర్లలో అబూ హైదర్ 44 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.
మరో బౌలర్ మహమ్మద్ నవాజ్ రెండు, మిగతా బౌలర్లంతా తలో వికెట్ పడగొట్టారు. అయితే లక్ష్య చేదనకు దిగిన చిట్టగాంగ్ కి తొలి ఓవర్ వేసిన వెస్టిండీస్ బౌలర్ ఒషేన్ థామస్ చెత్త ప్రదర్శన చేశాడు. ఏకంగా ఒక్క బంతికే 15 పరుగులు సమర్పించుకొని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
Also Read: Rohit Sharma – Virat Kohli: రోహిత్, కోహ్లీకి షాక్.. చివరి టెస్టుకు సీనియర్లు దూరం!
వరుసగా.. N, 0, N6, WD, WD, N4, 0, 0, N, 2, W, 0 పరుగులు సమర్పించుకున్నాడు. టీ-20 క్రికెట్ చరిత్రలో ఇది ఓ చెత్త ప్రదర్శన. ఈ మ్యాచ్ లో ఒకే ఒక ఓవర్ వేసిన థామస్ 18 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఈ ఒక్క ఓవర్ లో థామస్ 4 నో బాల్స్, 2 వైడ్స్ వేశాడు. ఈ ఓవర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
15 runs off 1 ball! 😵💫
Talk about an eventful way to start the innings! #BPLonFanCode pic.twitter.com/lTZcyVEBpd
— FanCode (@FanCode) December 31, 2024