Nitish Kumar – Bumrah: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్ట్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. నితీష్ కుమార్ రెడ్డి చేసిన సెంచరీ భారత ఇన్నింగ్స్ లో కీలకంగా మారింది. తన అద్భుత ఇన్నింగ్స్ తో భారత జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాడు. టెస్ట్ కెరీర్ లో 171 బంతులలో తొలి శతకం (114) సాధించడంతో నలువైపుల నుంచి నితీష్ పై ప్రశంసల వర్షం కురిసింది.
Also Read: Rohit Sharma – Virat Kohli: రోహిత్, కోహ్లీకి షాక్.. చివరి టెస్టుకు సీనియర్లు దూరం!
టి-20 ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డిపై నమ్మకం ఉంచిన భారత కోచ్ గౌతమ్ గంభీర్.. నితీష్ ని టెస్టుల్లోకి తీసుకున్నాడు. దీంతో కోచ్ నమ్మకాన్ని నిలబెడుతూ నితీష్ కీలక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో టెస్ట్ సెంచరీ చేసిన భారత ఎనిమిదవ బ్యాటర్ గా నిలిచాడు నితీష్. 2020 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లో అజింక్య రహనే 112 పరుగులు చేశాడు. ఆ రికార్డుని నితీష్ బ్రేక్ చేశాడు.
అంతకుముందు 2018 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాపై పుజారా చేసిన 106 పరుగులను కూడా బ్రేక్ చేశాడు. అయితే ఈ నాలుగవ టెస్ట్ లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఈ టెస్ట్ లో కీలక దశలో సెంచరీ చేసి జట్టును ఆదుకున్న నితీష్ కుమార్ రెడ్డి పేరుని మెల్ బోర్న్ హానరరీ బోర్డులో లిఖించారు.
నితీష్ తో పాటు ఈ బోర్డులో పేరు దక్కించుకున్నాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా. నాలుగో టెస్ట్ లో సత్తా చాటిన ఈ ఇద్దరి పేర్లుకు హానరరీ బోర్డులో చోటు దక్కింది. ఈ టెస్ట్ లోని మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో అదరగొట్టాడు బూమ్రా. ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తం తొమ్మిది వికెట్లతో రాణించాడు. తద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని నాలుగో టెస్ట్ లో భారత స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డుని బూమ్రా బద్దలు కొట్టాడు.
Also Read: Indian Team Schedule 2025: 2025లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..!
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. గతంలో అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డ్ ఉండేది. దీనిని బ్రేక్ చేస్తూ బూమ్రా ఎంజీసీలో ఇప్పటివరకు 24 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. ఇక బూమ్రా టెస్టుల్లో 200 వికెట్లు తీసిన 12వ భారత బౌలర్ గా నిలిచాడు. వికెట్ల ప్రదర్శనకు గాను బూమ్రా, సెంచరీ చేసినందుకు నితీష్ కుమార్ రెడ్డిల పేర్లను మేల్ బోర్న్ హానరరీ బోర్డులో లెక్కించడంతో వీరికి అరుదైన గౌరవం దక్కింది. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.
Nitish Kumar Reddy watching his name go on the MCG Honours Board. ❤️
– Bumrah and NKR, two historic performance at the ‘G. 🇮🇳pic.twitter.com/biBYX44RYf
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2024