Ravinda Jadeja : మాంచెస్టర్ వేదికగా టీమిండయా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 669 పరుగులు చేసింది. దీంతో 311 పరుగుల లీడ్ లో కొనసాగింది. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసింది. ఒక్క పరుగు కూడా చేయకుండా టీమిండియా బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా నాలుగో రోజే ఆలౌట్ అవుతుందని.. ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ కెప్టెన్ శుబ్ మన్ గిల్, కే.ఎల్. రాహుల్ అడ్డుగోడ మాదిరిగా నిలిచి టీమిండియాకి కీలక ఇన్నింగ్స్ ఆడారు. రాహుల్ 90 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్ లో LBW గా వెనుదిరిగాడు.
Also Read : Ind Vs Eng 4th Test : గిల్ సెంచరీ.. తొలి ఆసియా ప్లేయర్ గా రికార్డు..!
తొలి భారతీయ ఆటగాడిగా జడేజా
కెప్టెన్ శుబ్ మన్ గిల్ 103 పరుగులు సాధించాడు. శుబ్ మన్ గిల్ ఔట్ అయినప్పటికీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ చాలా కీలకంగా మారారు. వాషింగ్టన్ సుందర్ 67, రవీంద్ర జడేజా 64 పరుగులు చేశారు. ముఖ్యంగా టీమిండియా టెస్ట్ సిరీస్ లో ప్రతీ మ్యాచ్ లో రవీంద్ర జడేజా కింగ్ లా మారిన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో కూడా అలాగే కింగ్ అయ్యాడు. మ్యాచ్ ను ఓటమి నుంచి డ్రా వరకు తీసుకెళ్తున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ జడేజా హాఫ్ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. జడేజా ఇంగ్లాండ్ లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్ లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొట్టాడు. విదేశీ గడ్డ పై 1000 పరుగులు, 30 వికెట్లు తీసిన తొలి భారతీయ ఆటగాడిగా జడేజా నిలిచాడు.
148 ఏళ్ల క్రికెట్ లో అరుదైన రికార్డు
148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే భారతీయ ఆల్ రౌండర్ కూడా ఈ ఘనతను సాధించలేకపోయాడు. విదేశీ గడ్డ పై 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి 30 వికెట్లు తీసిన ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ జాబితాలో ఇంగ్లాండ్ కి చెందిన విల్ప్రెడ్ రోడ్స్, వెస్టిండిస్ ఆటగాడు గ్యారీ సోబర్స్ ఉన్నారు. విల్ప్రెడ్ రోడ్స్ ఆస్ట్రేలియా పై 1032 పరుగులు చేసి.. 42 వికెట్లు పడగొట్టాడు. గ్యారీ సోబర్స్ ఇంగ్లాండ్ పై 1820 పరుగులు చేసి 62 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ సిరీస్ లో ఆరో లేదా లోయర్ ఆర్డర్ లో 5 సార్లు 50 + పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. అతని కంటే ముందు.. గ్యారీ సోబర్స్ 1966 లో ఈ ఘనత సాదించాడు. అతను సునీల్ గవాస్కర్ స్పెషల్ క్లబ్ లో తన పేరు ను కూడా లిఖించుకున్నాడు.