BigTV English

Pak Media on India: 22 మంది హిందువుల క్షుద్ర పూజలు.. పాకిస్తాన్ మీడియా విష ప్రచారం

Pak Media on India: 22 మంది హిందువుల క్షుద్ర పూజలు.. పాకిస్తాన్ మీడియా విష ప్రచారం

Pak Media on India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం రోజు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఏ నుండి భారత్ సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ టోర్నీ నుండి నిష్క్రమించింది. సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు ఇంకా రేసులో ఉంది. ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ ని చిత్తు చేసే అలవాటును కొనసాగిస్తూ దాయాదుల పోరులో మరోసారి భారత్ పై చేయి సాధించింది.


 

ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో.. రిజ్వాన్ సేనకు ఘోర పరాభవం తప్పలేదు. ఆల్ రౌండ్ షో తో పాకిస్తాన్ ని ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది భారత్. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయి ఆడే విరాట్ కోహ్లీ 111 బంతులలో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పాకిస్తాన్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఇక ఈ గెలుపు అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. పాకిస్తాన్ పై విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.


ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్లతో పాటు విరాట్ కోహ్లీ పై ప్రశంశల వర్షం కురిపించాడు. బౌలర్లు గొప్పగా బంతులు వేసి.. పాకిస్తాన్ ని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని తెలిపాడు. ఇక దుబాయ్ పిచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. పిచ్ స్లోగా మారుతుంది అనే విషయం తమకు తెలుసని.. అందుకే బ్యాటింగ్ లో అనుభవం ఉన్న ప్లేయర్ రాణించాలని కోరుకున్నట్లు తెలిపాడు.

ఇక ఈ గెలుపు క్రెడిట్ ని అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకి ఇచ్చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ చాలాకాలంగా ఇలాగే రాణిస్తున్నాడని, అతడి సెంచరీ చూసి డ్రెస్సింగ్ రూమ్ లో ఎవ్వరూ ఆశ్చర్య పోలేదని తెలిపాడు. కోహ్లీ తో పాటు గిల్, అయ్యర్ సైతం కీలక ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ గెలుపు పై పాకిస్తాన్ మీడియా విష ప్రచారం చేస్తోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో 22 మంది హిందువులు క్షుద్ర పూజలు చేయడంతోనే పాకిస్తాన్ ఓడిపోయిందంటూ పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తోంది.

 

ఈ విష ప్రచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు యాంకర్లు మాట్లాడుతూ.. ” 1} 22 మంది హిందూ పూజారులు బ్లాక్ మ్యాజిక్ చేయడంతో పాకిస్తాన్ ఓడిపోయింది. 2} ఓ 22 1} అవును మాయాజాలం చేసి పాకిస్తాన్ ఆటగాళ్ల దృష్టిని మరల్చడానికి భారత్ 22 మంది హిందూ పూజారులను దుబాయ్ కి పంపించింది. 2} అవును భారత్.. పాకిస్తాన్లో ఆడడానికి నిరాకరించింది. ఎందుకంటే వారి పూజారులను ఇక్కడికి అనుమతించరు. 1} ఏడుగురు హిందూ పూజారులు మ్యాచ్ కి ఒకరోజు ముందు వారి ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి గ్రౌండ్ కి వెళ్ళినట్లు విన్నాను” అంటూ పాకిస్తాన్ మీడియా విషప్రచారం చేస్తోంది. అయితే ఈ మూర్ఖత్వం పై ప్రపంచం మొత్తం నవ్వుకుంటుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×