BigTV English

Jani Master Issue : అప్పుడు ఎంజాయ్ చేసి… ఇప్పుడు కేసులా? జానీ మాస్టర్ కేసుపై ఎస్తేర్ కామెంట్స్

Jani Master Issue : అప్పుడు ఎంజాయ్ చేసి… ఇప్పుడు కేసులా? జానీ మాస్టర్ కేసుపై ఎస్తేర్ కామెంట్స్

Jani Master Issue : టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా (Ester Norenha) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక, జూలియట్ లవర్ అఫ్ ఇడియట్, డెవిల్ వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా అదృష్టం కలిసి రాలేదు. బిగ్ బాస్ ఫేమ్ సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలతో ఎస్తేర్ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఇండస్ట్రీలో సంచలనంగా మారిన జానీ మాస్టర్ కేస్ పై స్పందించింది.


తేడా వచ్చేది అక్కడే… 

జానీ మాస్టర్ తన అసిస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో గత ఏడాది సెప్టెంబర్ లో అరెస్ట్ అయ్యి, 30 రోజులపాటు జైల్లోనే ఉన్నారు. తర్వాత ఆయన బెయిల్ పై బయటకు రావడం, జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేయడం వంటి షాకింగ్ పరిణామాలు జరిగాయి. తాజాగా ఈ వివాదంపై ఎస్తేర్ స్పందిస్తూ “ఇందులో ఎవరిది తప్పు అనే విషయాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే అసలేం జరిగింది అనే విషయం అంత డెప్త్ గా మనకు తెలియదు. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లోనూ మీటూ అనే ఉద్యమం జోరుగా సాగింది. అయితే ఎందుకు సౌత్ లో అసలు ఏం జరగలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటే… దానివల్ల వచ్చే బెనిఫిట్స్ తో అందరూ హ్యాపీగా ఉంటున్నారు. నువ్వు నాకు ఇది చేస్తే, నేను ఇది చేస్తాను అని అండర్స్టాండింగ్ తో ఉంటారు. అయితే ఇది వర్కౌట్ కానప్పుడు, ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో రిజల్ట్ లేనప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయి. అలాంటి టైం లో కంప్లైంట్ చేయకూడదు. ఎందుకంటే ఏదో ఒకటి ఆశించే కదా ఇన్వాల్వ్ అయింది. అంతేకానీ ఇక్కడ బలవంతంగా ఏమీ జరగలేదు కదా? అనుకున్న రేంజ్ లో రిటర్న్ రాలేదని అలా చేయడం తప్పు” అని చెప్పుకొచ్చింది.


రిబ్బన్ కటింగ్ ఒక సపరేట్ బిజినెస్ 

ఎస్తేర్ ఇంకా మాట్లాడుతూ “చాలామంది ఈమధ్య బయటకొచ్చి అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిందాని గురించి మాట్లాడతారు. మరి ఇన్నేళ్లు దానివల్ల డబ్బు సంపాదించుకున్నారు, కెరీర్ లో పిక్స్ చూశారు. అదంతా ఏమైంది? ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? పీక్స్ లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారే… దమ్ముంటే, నిజాయితీ ఉంటే అది జరిగినప్పుడే బయట పెట్టాలి. కష్టాలు అందరికీ ఉంటాయి.. నాక్కూడా ఉన్నాయి… నేను చాలా ప్రాజెక్ట్ లు పోగొట్టుకున్నాను. రీసెంట్ గా ఒక రిబ్బన్ కటింగ్ కోసం వెళ్తే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అలవాటు వాళ్లకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది?

ఏదైనా వన్ సైడ్ నుంచి జరగదు. ఒకటి రెండుసార్లు నువ్వు నో చెప్తే మూడోసారి అడగరు. ఒక్కోసారి నో చెప్పినప్పటికీ… అందరి ముందు అడుగుతున్నాం కాబట్టి ఇలా చెప్తోంది. తర్వాత వేరే రకంగా అడిగితే ఓకే చెప్తుందని భావిస్తున్నారు. అందరూ ఇలాగే చేస్తున్నారా ? అని అడిగితే అవును మీకు మాత్రమే ఏంటి ప్రాబ్లం అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. సినిమా మాత్రమే కాదు ప్రతి స్టేజ్ లోను ఇదే జరుగుతుంది. రిబ్బన్ కటింగ్ కూడా ఒకరోజు ముందే రమ్మంటున్నారు. రెండు మూడు సినిమాలు చేసిన వాళ్ళు కూడా సినిమాలు లేకపోయినా రిబ్బన్ కటింగ్ చేసి బ్రతుకుతున్నారు అంటే ఆలోచించండి. ఇదొక సపరేట్ బిజినెస్ లా మారింది” అంటూ ఇండస్ట్రీలోని చీకటి బాగోతాన్ని బయట పెట్టింది.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×