Pak Vs New Zealand Series : శుక్రవారం నుంచి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ మొదలవుతోంది. పాకిస్తాన్‌లో జరుగుతున్న మ్యాచ్‌ల కోసం ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు గట్టి ప్రాక్టీసే చేసింది. టీ20, వన్డే సిరీస్‌లో భాగంగా.. ఏప్రిల్ 14 నుంచి మే 7వ తేదీ వరకు ఐదు ట్వీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి ఇరు జట్లు. లాహోర్ గడాఫీ స్టేడియం, రావల్సిండి క్రికెట్ స్టేడియం, కరాచీలోని నేషల్ స్టేడియంలో ఈ సిరీస్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకు ఐదు టీ20లు, ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 7 వరకు ఐదు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.
హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ వైట్ బాల్ సిరీస్‌లు పాకిస్తాన్‌కు బాగా ఉపయోగపడనున్నాయి. రాబోయే ఆసియా కప్ కోసం ఇదో సన్నాహక సిరీస్‌గా భావిస్తోంది మెన్ ఇన్ గ్రీన్ జట్టు. అటు కివీస్ జట్టుకు కూడా ఈ రెండు సిరీస్‌లు కలిసి రానున్నాయి. శుక్రవారం నుంచి ఉపఖండంలో ఆడే మ్యాచ్‌లు.. రాబోయే వరల్డ్ కప్‌కు ఓ మంచి ప్రాక్టీస్ అవుతుందని భావిస్తోంది. వచ్చే వరల్డ్ కప్ కూడా ఉపఖండం అయిన ఇండియాలోనే జరగబోతోంది.
ఆసియా కప్, వరల్డ్ కప్‌లో ఇండియానే పాకిస్తాన్ జట్టుకు మెయిన్ టార్గెట్. అందుకే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లలో సత్తా చాటి.. తామే ఫేవరేట్‌గా బరిలో దిగాలని చూస్తోంది బాబర్ ఆజం స్క్వాడ్. పాకిస్తాన్ మెయిన్ టార్గెట్ ఇండియాలో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లే. సో, అందుకు న్యూజిలాండ్ సిరీస్, ఆసియా కప్‌ను బాగా ఉపయోగించుకోవాలనుకుంటోంది పాకిస్తాన్. ఇండియా కూడా ఆసియా కప్‌లో సత్తా చాటి.. వరల్డ్ కప్‌కు ఫేవరెట్ టీమ్‌గా బరిలో దిగాలనుకుంటోంది.