Pakistan hockey team : ఆగస్టు నెలలో ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ జరుగనునన విషయం తెలిసిందే. అయితే ఈ పోటీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు భారత్ కి రానుంది. ఇటీవలే భారత్ -పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ హాకీ జట్టుకు భారత్ లో ఆడేందుకు అనుమతి ఇస్తారా..? లేదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్ర క్రీడా శాఖ వర్గాలు ఈ అంశం పై ఓ స్పష్టతని ఇచ్చాయి. ఆసియా కప్, మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ హాకీ టీమ్ భారత్ కి రానున్నట్టు సమాచారం. దాయాది జట్టు ఆటగాళ్లకు వీసా ప్రాసెస్ మొదలైనట్టు విదేశాంగ, కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. క్రీడలు, రాజకీయాలను వేర్వేరుగా చూస్తాయని పేర్కొన్నాయి.
Also Read : Aamir Khan : వాడు సిక్స్ కొట్టి నా జీవితం నాశనం చేశాడు.. బాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు
ఆ ఉద్దేశం లేదు..
పాక్ జట్టును అనుమతించకపోతే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బిహార్ లో ఆగస్టులో ఆసియా కప్, ఆ తరువాత మధురైలో JWC జరుగుతాయి. పాకిస్తాన్ జట్టును ఈ ఆసియాకప్ టోర్నమెంట్‌లో అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని క్రీడా వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో జరుగుతున్న బహుళ జాతి క్రీడా పోటీలలో పాల్గొనే జట్లపై ఎటువంటి ఆంక్షలు విధించడంలేదని స్పష్టం చేశాయి. ద్వైపాక్షిక టోర్నీల విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందని పేర్కొన్నాయి. అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలను బట్టి, తాము తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని తెలిపాయి. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధంలో ఉన్నా కూడా, అవి బహుళ జాతుల క్రీడా ఈవెంట్లలో పాల్గొంటూనే ఉన్నాయని గుర్తు చేశాయి.
ఆగస్టు 27 నుంచి హాకీ టోర్నమెంట్..
బీహార్‌లోని రాజ్‌గిర్ నగరంలో ఈ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహించనున్నారు. మరోవైపు, సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా? అన్న ప్రశ్నపై కేంద్ర క్రీడాశాఖ స్పందించింది.
ఈ అంశంపై బీసీసీఐ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. బీసీసీఐ తమను సంప్రదించినప్పుడు, తగిన సమాచారం అందిస్తామని వెల్లడించింది. మరోవైపు ఇటీవల పహల్గామ్ దాడుల నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతకంటే ముందే పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పటికీ భారత్ పాకిస్తాన్ కి వెళ్లేందుకు నిరాకరించడంతో టీమిండియా కోసం ప్రత్యేకంగా దుబాయ్ వేదికగా మ్యాచ్ లను నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీ ని భారత్ ఎగురేసుకుపోవడంతో పాకిస్తాన్ కి తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇరు దేశాలకు అగ్గి వేస్తే భగ్గుమన్నట్టు నెలకొంది. అయినప్పటికీ హాకీ ఆసియా కప్ కోసం భారత్ కి పాకిస్తాన్ రావాలనుకుంటోంది. భారత్ కూడా అందుకు ఏమి అభ్యంతరం తెలపడం లేదని తెలుస్తోంది. కానీ ఏమైనా పరిస్థితులు మారితే మాత్రం మరోలా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ ఆసియా కప్ గురించి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.