ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పై ( ICC Champions Trophy 2025 ) తీవ్ర గందరగోళం నెలకొంది. వచ్చే ఏడాది జరగబోతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ కాకుండా… అటు దుబాయి కాదని దక్షిణాఫ్రికాకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం టీమిండియా అలాగే పాకిస్తాన్ జట్టు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ… పాకిస్తాన్ దేశంలో జరగాలి. అయితే 2008 నుంచి పాకిస్తాన్ కు టీమిండియా వెళ్లడం లేదు.
పాకిస్తాన్ అలాగే ఇండియాల మధ్య… ఉన్న సరిహద్దు గొడవల కారణంగా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. టీమిండియా…పాకిస్తాన్ కి వెళ్తే… ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్సులు స్పష్టంగా ఉంటాయని… భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకే ఛాంపియన్ ట్రోఫీ 2025 పాకిస్థాన్లో జరిపితే.. టీమిండియా ( Team India) అస్సలు వెళ్ళదని ఇప్పటికే తేల్చి చెప్పారు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు.
పాకిస్తాన్ కాకుండా దుబాయ్ లేదా… ఇతర ఏ దేశమైనా సరే … టీమిండియా వస్తుందని బీసీసీఐ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఐసీసీ అలాగే పాకిస్తాన్.. రెండు కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలికి లేఖలు రాసాయి. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ కు వస్తారా లేదా అనేది తేల్చి చెప్పాలని టీమిండియా కు లేఖలు రాశాయి. అయితే దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. నూరు 150 అయినా పాకిస్తాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టబోదని తెలిపింది.
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
అటు… పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) జరగకపోతే… మేము టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పిసిబి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య గొడవల నేపథ్యంలో… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును…. హైబ్రిడ్ మోడల్ లో భాగంగా… దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు వెళ్లి ఛాంపియన్ ట్రోఫీ ( ICC Champions Trophy 2025 ) ఆడాల్సిందేనని icc నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో అలాగే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తే టీమిండియా ( Team India) వెళ్లేందుకు.. రెడీగా ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ప్రకటించింది అంట. అటు పాకిస్తాన్ మాత్రం దీనిపై ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. పాకిస్తాన్ ( Pakisthan ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా.. దక్షిణాఫ్రికాలో టోర్నమెంట్ జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ రానంటే దాని స్థానంలో మరొక జట్టును సెలెక్ట్ చేస్తారు.
వాస్తవంగా చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో టీమిండియా ఆడితేనే ఆర్థికంగా ఐసిసికి లాభం చేకూరుతుంది. టీమ్ ఇండియా ఆడకపోతే ఎలాంటి ప్రకటనలు అలాగే ఫ్యాన్స్ కూడా ఆ మ్యాచ్లను చూడరు. అందుకే ఐసీసీ కూడా… బీసీసీఐ మాట వినాల్సి వస్తుంది.