E-Paper
Advertisement

ఆ స్వెట‌ర్ల వ‌ల్లే పాకిస్తాన్ ఓట‌మి..పెద్ద సైజులు తీసుకొచ్చింద‌ని PCBపై ట్రోల్స్‌

ఆ స్వెట‌ర్ల వ‌ల్లే పాకిస్తాన్ ఓట‌మి..పెద్ద సైజులు తీసుకొచ్చింద‌ని PCBపై ట్రోల్స్‌
Advertisement

Trolls On Pakistan players sweaters:  పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Pakistan VS Bangladesh) జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ ముగిసింది. ఆగస్టు 19వ తేదీన జరిగిన తొలి టెస్ట్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమిని చవి చూసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్లపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ల సొంత మాజీ క్రికెటర్లే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత చెత్త క్రికెట్ ఎవరు ఆడలేదని… పాకిస్తాన్ జట్టు చాలా దారుణంగా తయారయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ దారుణ ఓట‌మి

ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్ట్ లో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో రకరకాల కారణాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాబర్ ఆజం కెప్టెన్ గా లేకపోవడంతోనే పాకిస్తాన్ ఓడిపోయిందని కొంతమంది అంటుంటే, మరికొంతమంది సల్మాన్ అలీ కారణంగానే ఓడిపోయిందని చెబుతున్నారు. మరి కొంత మంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యల కారణంగానే ఘోర ఓటమి ఎదురైందని పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఆ స్వెటర్లే కొంపముంచాయా..?

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్లు స్వెటర్లు ధరించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ క్రికెటర్ల శరీర ఆకృతికంటే ఆ స్వెటర్లు చాలా పెద్దగా ఉన్నాయి. XXL కాకుండా XXXL సైజులు తీసుకువచ్చారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. పెద్ద సైజులో ఉన్న స్వెటర్లు ధరించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెటర్లు చాలా ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఓటమిపాలైందని.. సరైన సైజు స్వెటర్లు తీసుకువచ్చి ఉంటే రిజల్ట్ వేరే లాగా ఉండేదని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

అసౌకర్యంగా స్వెటర్లు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ పైన ఫోకస్ చేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి మొదటి మ్యాచ్ ఫలితం స్వెటర్ల కారణంగానే మారిపోయిందని.. పాకిస్తాన్ క్రికెటర్లను దూషించకూడదని కోరుతున్నారు. దీనికి కారణమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నిలదీయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. రెండు టెస్ట్ కైనా మంచి క్వాలిటీ, సరైన సైజులు ఉన్న కిట్టులు పాకిస్తాన్ క్రికెటర్లకు అందించాలని కోరుతున్నారు. అప్పుడైనా, పాకిస్తాన్ ప్లేయ‌ర్లు స‌రైనా పోటీని ఇంగ్లాండ్ కు ఇస్తార‌ని పేర్కొంటున్నారు.

బాబర్ ఆజం ఆడితేనే మళ్లీ పాకిస్తాన్ విజయం

మొదటి టెస్ట్ కంటే ముందు బాబర్ ఆజం గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో తొలి టెస్ట్ నుంచి అతడిని తప్పించారు. అతని స్థానంలో సల్మాన్ అలీకి కెప్టెన్సీ దక్కింది. కానీ కెప్టెన్ గా అతని పాత్ర సరిగ్గా వహించలేకపోయాడు. ఈ క్రమంలోనే తొలి టెస్టులో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే రెండో టెస్టులో మాత్రం బాబర్ వస్తాడని అంటున్నారు. అతడు గనుక ఆడకపోతే మరోసారి పాకిస్తాన్ ఓడిపోతుందని స్పష్టం చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Tags

Related News

యశస్వి జైస్వాల్ ను గెలికిన‌ అసిత ఫెర్నాండో… వేలు పెట్టి మ‌రీ బూతులు తిట్టిన లంక ప్లేయ‌ర్‌

ఆసీస్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓట‌మి..WTCలో టీమిండియాకు లైన్ క్లియ‌ర్‌

పరేడ్ కోసం ప్ర‌ధాని ష‌రీఫ్‌, అఫ్రిది ప్లాన్‌…బెడిసికొట్టిన పాకిస్తాన్ ప్లాన్‌

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పొట్టిగా ఉండ‌టం వ‌ల్లే, ఓడిపోయారు

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

చేతులు లేపి, త‌ల ప‌ట్టుకోవ‌డం త‌ప్ప‌..స‌ల్మాన్ అలీ పీకిందేమీ లేదు

Big Stories

Advertisement
×