E-Paper
Advertisement

Pakistan: తొడగొడుతున్న పాక్.. ఇజ్జత్ కా సవాల్!

Pakistan: తొడగొడుతున్న పాక్.. ఇజ్జత్ కా సవాల్!
Advertisement

T20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడమే పెద్ద అదృష్టమనుకుంటే… న్యూజిలాండ్ ఘోర ఆటతీరు కారణంగా… ఏకంగా ఫైనల్ కు చేరిన పాకిస్థాన్… ఇప్పుడు తొడగొడుతోంది. ఫైనల్ కు రండి తేల్చుకుందాం అంటూ టీమిండియాకు సవాల్ విసరుతోంది. దాంతో… 2007 నాటి ఫైనల్ మ్యాచ్ ను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలంటూ కౌంటర్ ఇస్తున్నారు… భారత అభిమానులు. ఇంగ్లండ్ పై సెమీస్ లో గెలిచి ఫైనల్లో రోహిత్ సేన పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.

T20 వరల్డ్ కప్ లో భారత్ గెలిచినా, పాక్ ఓడినా… ప్రతీసారీ ఏడ్చిన మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్… ఇప్పుడు పాక్ ఫైనల్ చేరేసరికి టీమిండియాను రెచ్చగొడుతున్నాడు. సెమీస్ లో టీమిండియాకు గుడ్ లక్ అంటూనే… మరో రసవత్తర పోరు కోసం మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్స్ లో వెయిట్‌ చేస్తుంటామంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో… టీమిండియా ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు చేరిన పాకిస్థాన్ కు అంత బిల్డప్ అవసరం లేదని… కాస్త ఓపిక పట్టు.. ఫైనల్ కు వచ్చి మీ జట్టు సంగతి తేలుస్తామంటూ కౌంటరిస్తున్నారు. అప్పుడే ఏమైంది? సెమీస్ లో ఇంగ్లండ్‌ను ఓడించి, ఫైనల్లో మీ తాట తీస్తామంటూ మరికొందరు ఘాటుగా బదులిస్తున్నారు. ఇంకొందరైతే… ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి వస్తే టీమిండియా కాస్త కష్టపడాల్సి వచ్చేదేమో కానీ… పాకిస్థాన్ అయితే అస్సలు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు అక్తర్ భాయ్… ఆడుతూ పాడుతూ మీ ఆట కట్టిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక… పాకిస్థాన్ మెంటార్ మాథ్యూ హేడెన్ కూడా… ఫైనల్లో పూర్తిస్థాయి సత్తా చూపుతామని… ఇండియా ఫైనల్ చేరితే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. భారత్‌-పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరన్నాడు.. హేడెన్. ఫైనల్ మ్యాచ్ జరిగే MCG పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని… కివీస్ తో మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిన బాబర్ తో పాటు, రిజ్వాన్, మహమ్మద్‌ హారిస్ భారత్ పై చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారని అన్నాడు.. హేడెన్. అంతేకాదు… పాక్ స్టార్ బౌలర్ రౌఫ్ వంద మైళ్ల వేగంతో బంతులేస్తున్నాడని… అతనితో పాటు షాదాబ ను ఆపడం ఎవరి వల్లా కాదని కవ్విస్తున్నాడు… హేడెన్.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×