BigTV English
Advertisement

Champions Trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ.. టైమింగ్స్ ఇవే, ఫ్రీగా చూడాలంటే ఎలా?

Champions Trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ.. టైమింగ్స్ ఇవే, ఫ్రీగా చూడాలంటే ఎలా?

Champions Trophy 2025:  చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు.. ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఈ టోర్నమెంట్ ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు… లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్…. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మొదటి మ్యాచ్… భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే టాస్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఉంటుంది.


Also Read: Kane Williamson: న్యూజిలాండ్ కు పాకిస్తాన్ గ్రాండ్ వెల్కమ్.. ఏకంగా ఆ అమ్మాయిలతో?

కరాచీ లోని నేషనల్ క్రికెట్ స్టేడియం లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఐసీసీ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. పాకిస్తాన్ లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. గ్రూప్ A లో టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్ B లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అలాగే ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపులలోని టాప్ 2 జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయన్నమాట.


ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… రేపటి నుంచి టీమిండియా మ్యాచ్లు ప్రారంభమవుతాయి. లీగ్ దశలో… మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి 23వ తేదీన.. పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.

Also Read: BCCI: BCCIకి పెళ్ళాల టార్చర్.. దెబ్బకు వెనక్కి తగ్గారు ?

టైమింగ్స్, లైవ్ చూడాలంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ దేశంలో జరిగే మ్యాచ్ లు అన్నీ… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. అలాగే.. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లన్ని… మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు ఉచితంగా చూసే అవకాశాలు లేవు. ఈ మ్యాచ్లు చూడాలంటే… జియో హాట్ స్టార్ లో లైవ్ చూడవచ్చు. స్పోర్ట్స్ 18, స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో మ్యాచ్ తిలకించవచ్చు.

పాకిస్థాన్ ప్రాబబుల్ XI: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం/సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్

న్యూజిలాండ్: ప్రాబబుల్ XI: విల్ యంగ్/రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్/జాకబ్ డఫీ, విల్ ఓ’రూర్క్

Related News

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Big Stories

×