BigTV English
Advertisement

Chahal – Mahvash: లండన్ లో అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్.. భార్యను కాదని ప్రియురాలితో !

Chahal – Mahvash: లండన్ లో అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్.. భార్యను కాదని ప్రియురాలితో !

Chahal – Mahvash: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ రేడియో జాకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వాష్ తో ప్రేమలో ఉన్నాడంటూ చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పబ్లిక్ గా కనిపించడంతో ఈ వార్తలు వచ్చాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ {2025} సమయంలో, డిన్నర్ ఔటింగ్ లు, ఒక యాడ్ షూట్ తో సహా చాలా సార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు.


Also Read: Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్ మామూలోడు కాదు.. అంజలి కంటే ముందే టాలీవుడ్ హీరోయిన్ సోదరితో ఎ**ఫైర్?

దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పలు సందర్భాలలో వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ ఈ కథనాలపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహాల్.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. “తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా” అంటూ తన మనసులోని మాటను చెప్పేశాడు. దీంతో ఈ జంట డేటింగ్ నిజమేనంటూ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా వీరి వ్యవహారం మరోసారి పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.


వీరిద్దరూ తాజాగా కలిసి లండన్ లో కనిపించడంతో.. చాహల్ – మాహ్వాష్ డేటింగ్ లో ఉన్నారంటూ మరోసారి ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ గా మారిన ఈ వీడియోలో వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించారు. గతంలో కూడా ఈ ప్రేమ జంట లండన్ లో ఉంటూ.. ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలలో బ్యాగ్రౌండ్ లోకేషన్ ఒకేలా కనిపించడంతో.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.

తాజాగా ఇప్పుడు ఈ జంట లండన్ లో చెక్కర్లు కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆర్జే మహ్వాష్ అత్యంత ప్రజాదారణ పొందిన రేడియో జాకీలలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లలో ఒకరు. ఈమె సినీ నిర్మాత, కంటెంట్ క్రియేటర్, రచయిత్రిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఈమె అలీగడ్ లో జన్మించింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూఢిల్లీలోని జమీమా మిలియా ఇస్లామియా నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Also Read: Nitish Kumar Reddy: ఏంట్రా తెలుగు సినిమాలు రీల్స్ చేసుకునే వాడిని.. టీమిండియాలోకి తీసుకువచ్చారా..?

ఇక చాహల్ కొద్ది రోజులుగా టీమిండియాకి దూరమైనప్పటికీ.. ఐపీఎల్ లో మాత్రం రాణిస్తున్నాడు. చాహల్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2025 టోర్నీ కంటే ముందు తన భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుండి చాహల్.. మహ్వాష్ తో డేటింగ్ లో ఉన్నట్లు కథనాలు వెలబడుతూనే ఉన్నాయి. ఈ కథనాలపై వీరు స్పందిస్తారా..? లేక ఇలాగే సస్పెన్స్ ని కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాలి.

Related News

Pratika Rawal: వీల్ చైర్ పైనే టైటిల్ అందుకున్న ప్రతీకా రావల్..గుండెలు పిండే ఫోటోలు వైర‌ల్‌

Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన‌… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?

Hardik Pandya: ఛాంపియ‌న్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హ‌ర్ధిక్ పాండ్యా

Womens World Cup 2025: 1983లో క‌పిల్, 2024లో సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్..ఈ 3 క్యాచ్ లు టీమిండియా రాత మార్చేశాయి

Rohit – Nita Ambani: నీతా అంబానీ చాటింగ్‌..సీక్రెట్ గా తొంగిచూసిన రోహిత్ శ‌ర్మ‌..వీడియో వైర‌ల్‌

Womens World Cup 2025: క‌న్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌, ప‌డుకుని జెమిమా సెల్ఫీ, BCCI భారీ నజరానా

ICC Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. PM నుంచి CM వరకు అభినందనలు

Ind vs SA, Final: వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే, రూ.100 కోట్ల‌కు పైగానే ?

Big Stories

×