Vinesh Phogat CAS Hearing Verdict Updates: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతకానికి సంబంధించిన అంశం. ఒలింపిక్స్ లో తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం అది కోర్టు ఆఫ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ( కాస్) పరిధిలోకి వెళ్లింది. అయితే తీర్పుని రిజర్వ్ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలకు తుది తీర్పు వెలువడనుంది. దీనిపై భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని రెజ్లర్ సమాఖ్యలు, క్రీడా సంఘాలు అన్నీ కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి.
సెమీస్ చేరిన రోజు తన క్లయింటు వినేశ్ నిర్ణీత బరువే ఉందని, అందుకే తనని బౌట్ కి అనుమతిచ్చారని వినేశ్ ఫోగట్ న్యాయవాదులు తెలిపారు. ఒక దాని తర్వాత ఒకటి మూడు బౌట్లు సమయపాలన లేకుండా పెట్టడం, తనకిచ్చిన రెస్ట్ రూమ్ కి , పోటీలు జరిగే ప్రాంతానికి చాలా దూరం ఉండటం వల్ల.. ప్రాక్టీసుకి సమయం సరిపోలేదని తెలిపారు. దీనివల్ల ఆట మధ్యలో మంచినీళ్లు తాగినా, ఫ్లూయిడ్స్ తీసుకున్నా ఆ 100 గ్రాములు కంట్రోలు అవలేదని తెలిపారు.
నిజానికి బౌట్ కి బౌట్ కి మధ్య సమయం ఇస్తే, కచ్చితంగా తను ప్రాక్టీసు చేసి బరువు తగ్గించుకునేదని చెబుతున్నారు. కనీసం తన జుత్తు కత్తిరించే సమయం కూడా లేదని, అలా ఉన్నా.. సరిపోయేదని వారు న్యాయమూర్తులకి తెలిపారు.
ఎక్సర్ సైజ్ లు చేసేందుకు సమయం ఇవ్వకపోవడం, బలమైన కుస్తీ పట్లు పట్టాల్సి రావడంతో బలవర్థకమైన ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి వచ్చినట్టు తెలిపారు. నిబంధనలు, నిర్వహణల్లో ఇన్ని లోపాలు ఉండటం వల్ల మానవతా ద్రక్పథంతో ఆలోచించి తన క్లయింటుకి కనీసం రజత పతకమైన ఇవ్వాలని వారు వాదించారు.
యునైటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య అయితే భారత రెజ్లర్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కాస్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్ బుక్ లో కొన్ని లొసుగులు ఉన్నాయని అంటున్నారు. తీర్పు వినేశ్ కి అనుకూలంగా వస్తే రెజ్లింగ్ సమాఖ్య రూల్ బుక్స్ పై విమర్శలు వస్తాయి. అందువల్ల వారు ఎదురుతిరుగుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వరల్డ్ రెజ్లింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. వినేశ్ ఫోగట్ సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ కి చేరిపోయింది. అక్కడ 100 గ్రాములు అధిక బరువు ఉందని డిస్ క్వాలిఫై అయ్యింది. అయితే ఫైనల్ లో ఒకరే ఉంటారు కదా.. అప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారు?
వినేశ్ చేతిలో ఓడిపోయింది కాబట్టి, సుసాకి నికి కాంస్య పతకం ఆడేందుకు అవకాశం లేదు. కానీ వినేశ్ ఫోగట్ డిస్ క్వాలిఫై అయ్యింది కాబట్టి, తనని కాంస్య పోరునకు అనుమతించారు.
చివరికి ఫైనల్ మ్యాచ్ క్యూబా, అమెరికా మధ్య నిర్వహించారు. వినేశ్ ఫోగట్ గెలిచిన తర్వాత తప్పుకోవడంతో.. ఈ వెనుక జరిగిన సిరీస్ అంతా, వీరి ప్లేసులో వారిని, వారి ప్లేసులో వీరిని ఆడించారు. ఇదంతా తప్పుల తడకగా జరిగింది. వాటన్నింటికి వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య అంగీకరించింది.
నిజానికి నిబంధనల ప్రకారం అలా చేయకూడదు. ఇప్పుడీ అంశాలనే వినేశ్ ఫోగట్ న్యాయవాదులు గట్టిగా సాస్ కోర్టులో వాదించారు. అక్కడ ఆట కోసం నిబంధనలను సవరించిన వారు, తన క్లయింటు విషయంలో ఎందుకు చేయరని వాదించారు. ఇన్ని సానుకూల పరిణామాల వల్ల వినేశ్ ఫోగట్ కి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నారు. అలా జరగాలని మనం ఆశిద్దాం.
Share