Stoinis Partner : ఐపీఎల్ 2025 సీజన్ లో నిన్నరాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోవడం విశేషం. పంజాబ్ ఆటగాళ్లు అంతా ఇలా వచ్చి అలా వెళ్లుతున్నారు. బెంగళూరు బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. పంజాబ్ జట్టు లో స్టోయినీస్ 26 పరుగులే టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. అయితే పంజాబ్ ఆటగాడు స్టోయినిస్ ఔట్ కావడంతో అతని భార్య విరాట్ కోహ్లీ పై కామెంట్స్ చేసింది. విరాట్ కోహ్లీ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడని.. దీంతో ఆమె బండ బూతులు తిట్టింది.
Also Read : PBKS Fans : తెల్లటి డ్రెస్సుల్లో అందాల భామలు..రాం రాజ్ కాటన్ అంటూ ట్రోలింగ్
విరాట్ కోహ్లి పై స్టోయినీస్ భార్య F*** అనడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టోయినీస్ భార్య ఇలా బూతులు కూడా తిడుతుందా..? అని నెటిజన్లు చర్చించుకోవడం విశేషం. ఆర్సీబీ క్వాలిఫయర్ 1లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్ ఫైనల్ కి దూసుకెల్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో పంజాబ్ ని చిత్తు చేసి ఫైనల్ కి చేరుకుంది. ముఖ్యంగా బౌలర్లు సత్తా చాటడంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. 11 ఏళ్ల తరువాత ప్లే ఆప్స్ కి చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది. నాలుగోసారి బెంగళూరు జట్టు ఫైనల్ కి చేరుకుంది. ప్రధానంగా సుయాశ్, హాజల్ వుడ్, సాల్ట్ రాణించారు. ఆర్సీబీ జట్టు ఫైనల్ కి చేరుకోవడంతో అభిమానులు సంబురాలు జరుపుకున్నారు.
అత్యంత వేగంగా 100+ టార్గెట్ ని పూర్తి చేయడం ఇది మూడోసారి. 10 ఓవర్లలోనే పంజాబ్ పై బెంగళూరు గెలిచింది. అంతకు ముందు 2015లో కేకేఆర్ పై ఆర్సీబీ నే 9.4 ఓవర్లలో 112 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. బంతుల పరంగా ఐపీఎల్ ప్లే ఆప్స్/ నాకౌట్ పోరులో భారీ విజయం నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. పంజాబ్ పై 60 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకు ముందు 2024 సీజన్ ఫైనల్ లో సన్ రైజర్స్ పై కోల్ కతా 57 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్ కి చేరుకుంది. 2009, 2011, 2016లో టైటిల్ పోరుకు వెళ్లినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేదు ఆర్సీబీ. ఇప్పుడు నాలుగో సారి ఫైనల్ కి దూసుకెళ్లింది. క్వాలిఫయర్ 1 లో విజేతగా నిలిచిన జట్టే.. అత్యధిక సార్లు టైటిల్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. 2011లో ప్లే ఆప్స్ ప్రారంభం తరువాత నుంచి 14 ఎడిషన్లలో 11 సార్లు క్వాలిఫయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్ గా కావడం విశేషం.
😭😭 https://t.co/pgjFG8zGOR pic.twitter.com/MQsVNprE5v
— 🍷. (@PrajaktaSharma8) May 29, 2025