BigTV English

PCB – Gaddafi Stadium: అదిరిపోయే లుక్‌ లో గడాఫీ.. ఇండియాకు కౌంటర్‌ ఇస్తూ ప్రకటన !

PCB – Gaddafi Stadium: అదిరిపోయే లుక్‌ లో గడాఫీ.. ఇండియాకు కౌంటర్‌ ఇస్తూ ప్రకటన !

PCB – Gaddafi Stadium: ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో పాకిస్తాన్ నిర్వహించబోతోంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లకు యూఏఈ వేదిక కానుంది. 1996 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తొలిసారి పాకిస్తాన్ వేదికగా జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోపీ 8 సంవత్సరాల తర్వాత మళ్లీ జరగబోతోంది.


Also Read: Ind vs Eng, 5th T20I: నేడే చివరి టీ20…భారీ మార్పులతో టీమిండియా..షమీకి నిరాశే !

ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం.. డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్తాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది. ఈ మెగా టోర్ని 19 రోజులపాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీలో.. ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ జట్టు తెలపడనుంది. అయితే ఈ ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్టేడియాల ఏర్పాటు ఓ తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.


స్టేడియాల పునరుద్ధరణ పనులు మందకొండిగా సాగుతున్నాయని, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాలేదని.. ఈ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని యూఏఈ కి తరలించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో లాహోర్ లోని గడాఫీ స్టేడియం పునరుద్ధరణ పనులను పూర్తి చేసి.. పూర్తిగా కొత్త లుక్ లో ఉన్న వీడియోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో గడాఫీ స్టేడియం పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తుంది. గడువులోగా పునరుద్ధరణ పనులు పూర్తి కావని, ఇది అసాధ్యమని భావించిన చాలామందికి కౌంటర్ ఇస్తూ ఈ వీడియోని విడుదల చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియాలు ఎప్పటికి సిద్ధమవుతాయి..? అన్న ప్రశ్నకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీకి.. భారత్ పై ఉన్న అక్రోసాన్ని బయటపెట్టాడు. బయట నుంచి కామెంట్లు చేసే వ్యక్తులు వారి పరిధులను అతిక్రమిస్తున్నారని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు.

Also Read: Rohit Sharma: పాస్ పోర్ట్ మర్చిపోయా…తన మతిమరుపుపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టేడియాలు ఇంకా పూర్తికానందున ఛాంపియన్ ట్రోఫీ తరలిపోతుందని బోర్డర్ కి అవతలి నుంచి వ్యాఖ్యలు వినిపించాయని.. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాకుండా ట్రై సిరీస్ ని కూడా ఘనంగా నిర్వహిస్తామని అన్నాడు. మేము చేసే ఏర్పాట్ల గురించి ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయమని.. పిసిబి అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవానికి సభ్య దేశాల క్రీడా మంత్రులతో పాటు అధికారులకు ఆహ్వానం పంపిస్తామని.. ఇందులో భారత్ ప్రతినిధులు ఉంటారని తెలిపారు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×