Ind vs Eng, 5th T20I: ఇవాళ టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) జట్ల మధ్య చిట్ట చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు రంగం సిద్ధం అయింది. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదవ టి20 మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium ) వేదికగా జరగనుంది. ఇవాళ సాయంత్రం 7:00 సమయంలో… ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు.. నిపుణులు చెబుతున్నారు. బ్యాటింగ్ చేసిన జట్టు మొదట విజయం సాధించే ఛాన్స్ ఉంది.
Also Read: Rohit Sharma: పాస్ పోర్ట్ మర్చిపోయా…తన మతిమరుపుపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే ముంబైలోని వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో…. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ముగ్గురు రాణిస్తారని.. అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురికి ముంబై ( Mumbai )హోం గ్రౌండ్ కావడంతో… ఈ ముగ్గురు ప్లేయర్లు దుమ్ము లేపుతారని అంటున్నారు. ఐపీఎల్ లో ఈ ముగ్గురు ప్లేయర్లు ముంబైకి ఆడుతున్నారు. అందుకే వీరిపై అందరూ నమ్మకం ఉంచుతున్నారు. అటు సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లోనైనా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
కాగా… నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ తరుణంలోనే… ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో తిరుగులేని 3-1 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అలాగే… శివమ్ దూబే ఒక్కొక్కరు 53 పరుగులతో గణనీయమైన సహకారాన్ని టీమిండియాకు అందించారు. దీంతో… నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… ఇంగ్లాండ్ పోరాడి ఓడింది. 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది ఇంగ్లండ్. దీంతో నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో బెన్ డకెట్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన హర్షిత్ రాణా 33 పరుగులకు మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.
Also Read: Chaiwala Dolly: ఏంట్రా ఇది… గ్రౌండ్ లోనే చాయ్ అమ్ముతున్న టీ మాస్టర్?
అంచనా వేసిన ప్లేయింగ్ XIలు
టీమిండియా: సంజూ శాంసన్( WC), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ©, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్(wk), బెన్ డకెట్, జోస్ బట్లర్ ©, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్