Warning To Pakistan Cricketers| పాకిస్తాన్ క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) గట్టి షాక్ ఇచ్చింది. ఫిట్ నెస్ పరీక్షలో పాస్ కాకపోతే వారి కాంట్రాక్టు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ టీమ్ లోని సెంట్రల్ కాంట్రాక్ట ఉన్న 6-7 క్రికెటర్లకు ఈ వార్నింగ్ ఇవ్వడంతో పాకిస్తాన్ మీడియా దీని గురించే ప్రత్యేక కథనాలు ప్రచురించింది.
సెప్టెంబర్ నెల తొలి వారంలో జరిగిన ఫిట్ నెస్ పరీక్షల్లో కొంతమంది ఆటగాళ్లు ఫెయిల్ కావడంతో సోమవారం సెప్టెంబర్ 30న లాహోర్ లో పాకిస్తాన్ టీమ్ ఫిట్ నెస్ ట్రైనర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో పిసిటి తిరిగి ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తోంది.
Also Read: విరాట్ – బాబర్.. ఒకే జట్టులో గురుశిష్యులు ?
”దేశీయ క్రికెటర్లయినా, జాతీయ క్రికెటర్లయినా వారి కాంట్రాక్టుల్లో స్పష్టంగా కండిషన్స్ ఉన్నాయి. నిపుణులు నిర్వహించే ఫిట్ నెస్ లెవెల్స్ టెస్ట్ లో వారు అర్హత సాధించాలని కాంట్రాక్టులో తెలియజేశాము. ఫిటెనెస్ పరీక్షల్లో ఏ క్రికెటర్ కు మినహాయింపు ఇవ్వకూడదని ఇద్దరు విదేశీ కోచ్ లు గ్యారీ కిర్‌స్టన్, జేసన్ గిల్లెస్పీ సూచించారు. ఈ ఫిట్ నెస్ టెస్టుల్లో క్రికెటర్ స్టామినా, కండరాల బలం, శరీర పటుత్వం పరీక్షింపబడతాయి. ఇంతకుముందు జరిగిన ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిలైన వారికి రెండు నెలల సమయం ఇచ్చాం. కానీ సోమవారం జరిగే టెస్టుల్లో వాళ్లు తప్పనిసరిగా పాస్ అయితేనే వారి కాంట్రాక్టు నిలబడుతుంది. ” అని ఒక పిసిబి అధికారి మీడియాకు తెలిపారు.
జాతీయ స్థాయి క్రికెటర్ల లిస్టు వారి కాంట్రాక్టుల గురించి పిసిబి ప్రతి సంవత్సరం జూలై నెలలో ప్రకటిస్తుంది. కానీ గత సంవత్సరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మార్పలు జరిగినప్పటి నుంచి సెప్టెంబర్ లో జాతీయ కాంట్రాక్టు కలిగిన క్రికెటర్ల లిస్టు ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబర్ లో ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా 27 మంది క్రికెటర్లు జాతీయ కాంట్రాక్టు పొందుతారు. కానీ ఈ సంవత్సరం ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కొత్త కోచ్ లిద్దరూ ఆటగాళ్ల ఆటతీరుతో పాటు వారి ప్రవర్తనని బట్టి కూడా సెలెక్షన్ చేయాలని సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రికెటర్లు.. సరైన ఫిట్ నెస్ లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2023లో ఇండియాలో జరిగిన ప్రపంచ కప్ తరువాత పాకిస్తాన్ మాజీ కోచ్ మికీ అర్థర్, కెప్టెన్ బాబార్ ఆజం.. ఆటగాళ్ల ఫిట్ నెస్ పై శ్రద్ధపెట్టలేదని.. టీమ్ ట్రైనర్ ఆటగాళ్ల ఫిట్ నెస్ గురించి చెప్పినా అతడిని నిర్లక్ష్యం చేశారని మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్, టీమ్ మాజీ డైరెక్టర్ ముహమ్మద్ హఫీజ్ బహిరంగంగా చెప్పడంతో పాకిస్తాన్ టీమ్ లో వివాదాలు మొదలయ్యాయి.