E-Paper
Advertisement

Portugal : నాకౌట్‌కు పోర్చుగల్

Portugal : నాకౌట్‌కు పోర్చుగల్
Advertisement

Portugal : ఫిఫా వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచిన పోర్చుగల్… నాకౌట్ చేరిన మూడో జట్టుగా నిలిచింది. గ్రూప్-Hలో భాగంగా ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో… 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది… పోర్చుగల్. ఆ రెండు గోల్స్ వేసి పోర్చుగల్ అభిమానుల్లో జోష్ నింపాడు… బ్రూనో ఫెర్నాండెజ్.

ఆట ఆరంభం నుంచి పోర్చుగల్, ఉరుగ్వే హోరాహోరీగా తలపడ్డాయి. కానీ తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక… 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టిన షాట్‌… స్టార్ ఆటగాడు రోనాల్డో తలమీదుగా వెళ్లడంతో… తానే హెడర్ గోల్ చేసినట్లు రొనాల్డో సంబరాలు చేసుకున్నాడు. కానీ… పదేపదే రీ ప్లే చూసిన తర్వాత… బంతిని రొనాల్డో హెడర్‌గా పంపలేదని తేల్చారు. దాంతో… ఆ గోల్ కాస్తా బ్రూనో ఫెర్నాండెజ్ ఖాతాలో చేరింది. పోర్చుగల్ 1-0 గోల్స్ ఆధిక్యంలోకి వెళ్లింది.

Advertisement

ఆ తర్వాత ఉరుగ్వే ఆటగాళ్లు కూడా పదే పదే పోర్చుగల్ గోల్ పోస్ట్ మీద దాడులు చేశారు. 75వ నిమిషంలో ఉరుగ్వే ఆటగాడు కొట్టిన షాట్‌ను పోర్చుగల్ గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. మరో మూడు నిమిషాల తర్వాత ఉరుగ్వేకు ఫ్రీ కిక్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో నిమిషానికే మళ్లీ ఉరుగ్వే ఆటగాడు కొట్టిన షాట్‌ను… పోర్చుగల్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. మూడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా సఫలం కాకపోవడంతో… ఉరుగ్వే ఆటగాళ్లు, అభిమానులు నిరాశపడ్డారు. ఇక ఆట మరో నిమిషంలో ముగుస్తుందగా పోర్చుగల్ కు పెనాల్టీ కిక్ వచ్చింది. ఆ అవకాశాన్ని కూడా బ్రూనో ఫెర్నాండెజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఉరుగ్వే గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ… బంతిని నెట్లోకి పంపాడు. దాంతో.. పోర్చుగల్ 2-0 గోల్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. 9 నిమిషాల అదనపు సమయం ఆఖర్లో కూడా… ఫెర్నాండెజ్ రెండుసార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించినా… బంతి గోల్ పోస్ట్ బార్ ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. చివరికి ఆట ముగిసే సమయానికి 2-0 ఆధిక్యంలో నిలిచిన పోర్చుగల్… ఉరుగ్వేపై విజయంతో నాకౌట్‌కు చేరింది.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×