BigTV English

This Week Theatre And OTT Movies: ఈవారం ముచ్చట్లు.. థియేటర్ / ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, సిరీస్‌లంటే..?

This Week Theatre And OTT Movies: ఈవారం ముచ్చట్లు.. థియేటర్ / ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, సిరీస్‌లంటే..?

This Week Theatre And OTT Movies: ప్రతి వారం మాదిరిగానే మరో వారం వచ్చేసింది. అందువల్ల ఈ వారంలో థియేటర్, ఓటీటీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు మూడో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ వచ్చేసింది. అందులో థియేటర్లలో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోగా.. ఒకటో రెండో చిన్న సినిమాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అదే సమయంలో ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. అందులో కల్కి 2898 ఏడీ, రాయన్ సహా పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.


థియేటర్ సినిమాలు

మారుతీనగర్ సుబ్రహ్మణ్యం


విలక్షణ నటనకు పేరుగాంచాడు యాక్టర్ రావు రమేష్. తండ్రిగా, విలన్‌గా, నెగిటివ్ షేడ్స్‌తో సహా మరెన్నో పాత్రలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 23న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

డిమాంటి కాలనీ 2

అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుల్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తున్న సినిమా డిమాంటి కాలనీ 2. ఈ సినిమా తమిళ్‌లో ఆగస్టు 15న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తుంది. ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ కానుంది.

Also Read: పుష్ప 2 వర్సెస్‌ చావా, కొత్త చిక్కుల్లో పడ్డ రష్మిక

ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. అందులో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు ‘యజ్ఞ’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఓటీటీ చిత్రాలు / సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్

ఆగస్టు 20 – టెర్రర్ ట్యూజ్‌డే:ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్)

ఆగస్టు 22 – జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్‌సిరీస్)

ఆగస్టు 22 – కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్)

ఆగస్టు 22 – మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)

ఆగస్టు 22 – ప్రె‍ట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 (జపనీస్ మూవీ)

ఆగస్టు 23 – ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)

ఆగస్టు 23 – ది ఫ్రాగ్ (కొరియన్ వెబ్ సిరీస్)

హాట్‌స్టార్

ఆగస్టు 20 – గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)

ఆగస్టు 23 – ది సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)

అమెజాన్ ప్రైమ్

ఆగస్టు 20 – యాంగ్రీ యంగ్‌మ‍్యాన్:ది సలీం జావేద్‌స్టోరీ (హిందీ వెబ్‌సిరీస్)

ఆగస్టు 22 – కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ)

ఆగస్టు 23 – ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)

ఆగస్టు 23 – రాయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా)

జియో సినిమా

Also Read: సూర్యతో పోటీకి సిద్ధమైన రజినీకాంత్.. ‘వెట్టియాన్’ రిలీజ్ డేట్ ఖరారు

ఆగస్టు 23 – డ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లీష్ చిత్రం)

ఆహా

ఆగస్టు 23 – ఉనర్వుగల్ తొడరకథై (తమిళ చిత్రం)

మనోరమ

ఆగస్టు 23 – స్వకార్యం సంభవబాహులం (మలయాళ సినిమా)

ఆపిల్ ప్లస్ టీవీ

ఆగస్టు 23 – పచింకో సీజన్-2 (కొరియన్ వెబ్ సిరీస్)

లయన్స్ గేట్ ప్లే

ఆగస్టు 23 – ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ చిత్రం)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×