BigTV English

Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు… ఇండియన్ ఆర్మీ కోసం షాకింగ్ నిర్ణయం

Preity Zinta :  ప్రీతి జింటా గొప్ప మనసు… ఇండియన్ ఆర్మీ కోసం షాకింగ్ నిర్ణయం

Preity Zinta : ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్ సహా ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల అమరవీరులు అయిన సైనికుల భార్యలు, పిల్లలకు భారీ విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.1.10 కోట్లు అమరులైన సైనిక కుటుంబాలకు అందజేశారు. ప్రీతి జింటా తన మంచి పనులతో అందరి మనసులను ఎప్పుడూ గెలుచుకుంటూనే ఉన్నారు. దేశం కోసం మంచి చేయడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు. ఇక ఈ సారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల భార్యలు, పిల్లలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అమరులైన సైనికుల కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించారు. సైనికుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని తెలిపారు ప్రీతి జింటా. ఆమె అందజేసిన రూ.1.10 కోట్లు వారు పూర్తిగా వారి జీవనం, పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.


Also Read :  Virat Kohli : ఫుట్ బాల్ ఎందుకు బాస్.. ఎగిరి కింద పడ్డ కోహ్లీ!

” మా సాయుధ దళాల ధైర్యవంతమైన కుటుంబాలకు సహాయం చేయడం గౌరవం, బాధ్యత. మన సైనికులు చేసే త్యాగానికి ఎప్పటికీ ప్రతిఫలం ఉండదు. కానీ.. వారి కుటుంబాలకు అండగా నిలబడి ముందుకు రావడానికి సహాయం చేయవచ్చు. మా సాయుధ దళాల గురించి మాకు గర్వంగా ఉంది. మా దేశం, దాని ధైర్యవంతులైన రక్షకులతో మేము నిలబడుతున్నాం” అని ప్రీతి జింటా పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన పంజాబ్.. తొలి టైటిల్‌ను గెలుచుకుంటామనే నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఈసారి ఆడిన 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ జట్టు ముంబై ఇండియన్స్ తో ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు మొదటి క్వాలిఫయర్ ఆడటం దాదాపు ఖాయం అవుతుంది.


ఫైనల్ కి పంజాబ్ కి ఛాన్స్.. 

వాస్తవానికి పంజాబ్ కింగ్స్ జట్టు కి కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉండటం గొప్ప విషయం. గత ఏడాది శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోనే కోల్ కతా నైట్ రైడర్స్ టైటిల్ ని సాధించింది. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా శ్రేయస్ కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్లింది. ఇక ఈ సీజన్ లో కూడా పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ టాప్ 2లో నిలిస్తే.. క్వాలిఫయిర్ మ్యాచ్ లో గుజరాత్ లేదా ఆర్సీబీతో విజయం సాధిస్తే.. పంజాబ్ నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది. అలా కాకుండా టాప్ 3, 4లో నిలిస్తే.. మాత్రం ఫైనల్ కి చేరుకోవాలంటే.. ప్రతీ మ్యాచ్ లో గెలిస్తేనే టైటిల్ సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఇక ఓడిపోయిన వెంటనే ఇంటి బాట పట్టాల్సిందే. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ దాదాపు ఫైనల్ కి వెళ్తుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×