BigTV English

Bellamkonda Sreenivas: నాకు డూప్స్ లేరు… స్టార్ హీరోలకు స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చిన బెల్లంకొండ

Bellamkonda Sreenivas: నాకు డూప్స్ లేరు… స్టార్ హీరోలకు స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చిన బెల్లంకొండ

Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కలిసి చేస్తున్న సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా మే 30న ప్రేక్షకులు ముందుకు రానుంది. అందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు చూద్దాం..


నాకు డూప్స్ లేరు… స్టార్ హీరోలకు .. కౌంటర్..

భైరవం చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ నారా రోహిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానుంది. తాజాగా సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా స్టంట్ అన్నీ నేనే స్వయంగా చేస్తాను ఎందుకంటే వేరే వాళ్ళ బాడీ నా స్టైల్ లో చేయలేదు. నా బాడీ లాంగ్వేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో నా ఎనర్జీని ప్రేక్షకులకు స్వయంగా నేనే అందించాలనుకుంటున్నాను. అందుకే నేను స్టెంట్స్ చేసేటప్పుడు నేనే చేయాలి అనుకుంటాను. డూప్ నాకు అవసరం లేదు అని శ్రీనివాస్ అన్నారు. ఇక టాలీవుడ్ లో ప్రభాస్ కి ఇద్దరు డూప్స్, అల్లు అర్జున్ కి, రామ్ చరణ్ కి,ఎన్టీఆర్,మహేష్ బాబు,చిరంజీవి లాంటివాళ్ళకి డూప్స్ ఉన్నారు.అంత పెద్ద హీరోలే డూప్స్ పెట్టుకొని చేస్తుంటే సాయి శ్రీనివాస్ నేను డూప్ లేకుండా, నేనే స్టంట్స్ స్వయంగా చేస్తాను అని చెప్పి వాళ్ళందరికీ కౌంటర్ వేశాడు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


నా సినిమాలో డూప్ వుండదు ..

సాయి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలకు కౌంటర్ గా భావించవచ్చు.ఆయన నటించిన ఎన్నో సినిమాలు యాక్షన్ కు పెద్ద పేట వేసినవే,ముఖ్యంగా బోయపాటి శీను దర్శకత్వం లో వచ్చిన జయ జానకి నాయక మూవీ యాక్షన్ ఎంటర్టైన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్నో సీన్స్ లో శ్రీనివాస్ డూప్ లేకుండా నటించారు.అల్లుడు శీను సినిమా నుండి మొన్న వచ్చిన ఛత్రపతి రీమేక్ వరకు సాయి మూవీలో డూప్ లేదని ఈ ఇంటర్వ్యూ తో క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు హై రిస్క్ స్టంట్స్ కోసం డూపులను వాడతారు. అయితే సాయి శ్రీనివాస్ తన సినిమాలో తానే స్టంట్ స్వయంగా చేయడం తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలతో భైరవం సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత క్రేజీ మల్టీస్టారర్ మూవీ భైరవం రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుత ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రేక్షకులు ముందుకు రానుంది. విడుదలైన తర్వాత ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×