Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) దాదాపు 18 ఏళ్ల నుంచి ఆడుతున్నాడు. కానీ ఒక్క సారి కూడా ఆ జట్టుకి మాత్రం టైటిల్ రాలేదు. ఈ సారి ఎలాగైనా ఆర్సీబీ కి టైటిల్ అందించాలని భావిస్తున్నాడు. తాను కీలక బ్యాటర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. 2023 వరకు ఆర్సీబీ కి కెప్టెన్ గా కొనసాగాడు. తాను కెప్టెన్ గా ఉంటే.. జట్టు కి టైటిల్ అందించలేకపోతున్నానని.. కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరపున మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ కి చేరుకుంది.
Also Read : Preity Zinta : ప్రీతి జింటాతో డుప్లెసిస్ మూవీ.. ఫోటో వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ స్టార్ విరాట్ కోహ్లీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ కి ముందు ఫుట్ బాల్ ఆడుతూ కనిపించాడు. భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఫుట్ బాల్ తన్నేందుకు ప్రయత్నిస్తుండగా.. ఏస్ కొట్టు నేలపై పడింది బంతిని కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అదృష్టవశాత్తూ కోహ్లీ కనిపించలేదు. కింద పడ్డ వెంటనే అతను లేచి బాల్ ను సేకరించడానికి వెళ్లాడు. ఆ సమయంలో కోహ్లీకి స్వల్ప గాయమైనట్టు తెలుస్తోంది. బౌండరీ రోప్ దగ్గర బంతిని అందుకొని ఎత్తుగా పైకి తన్నాడు. ఆ సమయంలోనే కోహ్లీ కింద పడ్డట్టు తెలుస్తోంది. మే 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. నేరుగా టాప్ లోకి వెళ్లనుంది ఆర్సీబీ.
ఇక ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో 155.35 స్ట్రైక్ రేట్ తో 13 ఇన్నింగ్స్ ల్లో 581 పరుగులు చేసాడు. ప్రస్తుతం ఈ జట్టు టాప్ 2లోకి వెళ్లితే.. టాప్ 1,2 జట్లతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధిస్తే.. నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కి చేరుకుంటుంది. ఫైనల్ లో ముంబై లేదా పంజాబ్ జట్లతో తలపడనుంది అని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే కీలక మ్యాచ్ లో విజయం సాధిస్తేనే.. ఫైనల్ కి చేరుకుంటుంది. లేదంటే.. ఆర్సీబీ పరిస్థితి అగమ్య ఘోచరంగా తయారవుతుంది. మిగతా జట్ల పై ఆధారపడాల్సి వస్తుంది. లేదంటే.. టాప్ 3 లేదా 4 కి వెళ్లితే.. మరో రెండు మ్యాచ్ ల్లో ఆడాల్సి వస్తుంది. ఎలిమినేటర్ లో ఒకవేళ ఓడిపోతే.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. లక్నోతో గెలిస్తే.. ఆ టీమ్ కి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మే 27న జరిగే మ్యాచ్ పై ఆర్సీబీ ఫలితం ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి మరీ.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 25, 2025