E-Paper
Advertisement

ఆ సీనియర్ నటుడు ఇంట్లో దొంగతనం చేసిన సూర్య.. ఇలాంటి యాంగిల్ కూడా ఉందా బాసు!

ఆ సీనియర్ నటుడు ఇంట్లో దొంగతనం చేసిన సూర్య.. ఇలాంటి యాంగిల్ కూడా ఉందా బాసు!
Advertisement

Veera Bhadrudu pre Release: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సూర్య(Suriya) ఒకరు. ఈయన కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇక సూర్య సినిమా తెలుగులో విడుదల అవుతుంది అంటే ఇక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉంటారు. తెలుగులో కూడా సూర్య సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే  హీరోగా నటించిన వీరభద్రుడు(Veera Bhadrudu)  సినిమా మే 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

సూర్య కరుప్పు మూవీ..

ఈ సినిమా తమిళంలో కరుప్పు అనే పేరిట విడుదల కాగా, తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ కూడా హాజరయ్యారు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు ఈ సినిమా వేదికలో ఉండడంతో యాంకర్ సుమ వీరిద్దరికి సంబంధించి చిన్నప్పటి ఫోటోలను చూయిస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారు.

మామిడి పండ్లు దొంగతనం. .

Advertisement

ఇక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు అంటే వారి మధ్య ఉండే గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పుడు వీరిద్దరి మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉండేవి అంటూ కార్తి సరదాగా తెలియజేశారు. ఇలా చిన్నప్పటి విషయాలన్నింటిని గుర్తు చేసుకుంటూ సూర్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు.. చిన్నప్పుడు వీరి ఇల్లు మరొక నటుడు నూతన ప్రసాద్(Nuthan prasad) ఇంటి పక్కనే ఉండేదని సూర్య తెలియజేశారు. అయితే మ్యాంగో సీజన్ వచ్చిన సమయంలో తాము నూతన ప్రసాద్ గారి ఇంటి గోడ పైకి ఎక్కి ఆయన ఇంటి ముందు ఉన్న మామిడి చెట్లు నుంచి మామిడిపళ్ళను దొంగతనం చేసే వాళ్ళమని తెలిపారు.

గ్రామీణ నేపథ్యంలో వీరభద్రుడు..

Advertisement

నేను వెళ్లి ఒక మామిడిపండు కోసుకొచ్చే వాడిని ఆ పండు కోసం ఇద్దరం గొడవ పడే వాళ్ళం అంటూ అప్పటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా సూర్య చిన్నప్పుడు మామిడి పండ్లను దొంగతనం చేశానని చెప్పడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే . ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read: విశ్వనాథన్ అండ్ సన్స్ విడుదల తేదీపై వెంకీ అట్లూరి క్లారిటీ.. రిలీజ్ అప్పుడేనా?

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×