Wine shops Closed in AP new liquor policy: మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. ఏపీలో రేపటి నుంచి వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఏపీ సర్కార్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. ఈ విషయంపై ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే మద్యం దుకాణాలను నడిపించనుంది.
మరోవైపు వైన్స్ లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పాలసీతో తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి వైన్స్ షాపులు బంద్ కానున్నట్లు సమాచారం.
కాగా, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీని అమలు చేసేందుకు ఏపీ సర్కార్ ముందుకు రావడంలేదని సమాచారం. ఇందులో భాగంగానే మళ్లీ పాత పద్ధతిలోనే మద్యం దుకాణాలను నడిపేందుకు ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాత పద్దతిలోనే మద్యం దుకాణాలను నడిపిస్తే.. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్ మేన్ ఉద్యోగాలకు భద్రత ఉంటుంది.
Also Read: జగన్ ఫారెన్ టూర్ ఆలస్యం.. పాస్‌పోర్టు కష్టాలు, వెనుక ఏదో..
ఏపీలో కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. మద్యం రేట్లు భారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు తెలంగాణలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లనే ఏపీలో అందుబాటులోకి తీసుకొస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేదం పేరుతో ధరలను విపరీతంగా పెంచడంతోపాటు నకిలీ బ్రాండ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.