PBKS VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా… ఇవాళ ఐదవ మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా కొనసాగింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Gujarat Titans vs Punjab Kings ) జట్ల మధ్య… ఇవాళ టైట్ ఫైటింగ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో చివరకు పంజాబ్ కింగ్స్ ను విజయం వరించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన గుజరాత్ టీం… చివరకు చేతులెత్తేసింది. ఈ తరుణంలోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది పంజాబ్ కింగ్స్ టీం. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు పైన 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 232 పరుగులు మాత్రమే చేసింది గుజరాత్ టైటాన్స్. దీంతో 11 పరుగుల తేడాతో గుజరాత్ పైన పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
Also Read: Rishabh Pant: రూ. 27 కోట్లు తీసుకుని ఒక్క స్టంప్ చేయలేదు.. పంత్ పై ట్రోలింగ్ !
ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు… ఏకంగా 243 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , ఓపెనర్ ప్రియాంష్ ఆర్య, చివర్లో శశాంక్ సింగ్ దుమ్ము లేపారు. ఈ దెబ్బకు… 20 ఓవర్లలోనే 243 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్ టీం. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. 42 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. అయితే మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న శ్రేయస్ అయ్య తొమ్మిది సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు కొట్టాడు. అటు చివర్లో శశాంక్ సింగ్ 16 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి. 275 స్ట్రైక్ రేట్తో రఫ్ ఆడించాడు శశాంక్ సింగ్. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి చివర్లో కీలకమైన రెండు వికెట్లు తీశాడు. అదే సమయంలో 36 పరుగులు ఇచ్చాడు ఈ పంజాబ్ బౌలర్.
Also Read: PBKS VS GT: బౌలింగ్ చేయనున్న గుజరాత్.. భారీ మార్పులతో పంజాబ్
పోరాడి ఓడిన గుజరాత్
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు చాలా పోరాడి ఓడిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట్లో వచ్చిన సాయి సుదర్శన్… 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. అతను మరో మూడు లేదా నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే… కచ్చితంగా గుజరాత్ టీం గెలిచేది. అటు గిల్ కూడా 33 పరుగులతో దుమ్ము లేపాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ 33 బంతుల్లో 54 పరుగులు చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రూథర్ఫర్డ్ కూడా రఫ్ ఆడించాడు.
.