BigTV English

FIFA World Cup : ఖతార్ ఖేల్ ఖతం

FIFA World Cup : ఖతార్ ఖేల్ ఖతం

FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య దేశమైన ఖతార్ ఖేల్ ఖతమైంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో… ఆ జట్టు ఇక ఇంటిదారి పట్టినట్టే. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో 2-0 గోల్స్ తేడాతో ఓడిన ఖతార్… రెండో మ్యాచ్‌లో సెనెగల్ చేతిలో 3-1 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలి గోల్ కొట్టడం ఒక్కటే ఖతార్‌కు దక్కిన ఊరట.


గ్రూప్‌-Aలో భాగంగా సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో… ఖతార్ ఏ దశలోనూ పోరాటపటిమ కనబరచలేదు. మ్యాచ్ ఆద్యంతం ఖతార్‌పై సెనెగలే ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్థభాగంలో… ఆట 41వ నిమిషంలో బులాయో డిఐఏ సెనెగల్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే ఆట 48వ నిమిషంలో ఫర్మారా డియోహౌ రెండో గోల్‌ అందించాడు. దీంతో తొలి అర్థభాగం ముగిసేసరికి సెనెగల్‌ 2-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్థభాగంలో ఆట 78వ నిమిషంలో ఖతార్‌కు తొలి గోల్‌ వచ్చింది. మహ్మద్‌ ముంతారి జట్టుకు తొలి గోల్‌ అందించాడు. సెనెగల్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించి ఖతర్‌ కాస్త లైన్లోకి వచ్చినట్లే కనిపించింది. కానీ ఆట 84వ నిమిషంలో సెనెగల్‌ ప్లేయర్ చెక్‌ డింగ్‌ మరో గోల్‌ కొట్టడంతో… ఆ జట్టు 3-1 గోల్స్ తోడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట ముగిసే సమయానికి ఖతార్ మరో గోల్ చేయలేకపోయింది. చివరికి సెనెగల్‌… ఈ వరల్డ్‌కప్‌లో తొలి గెలుపు రుచి చూసింది.

ఈ విజయంతో సెనెగల్‌ వరల్డ్‌కప్‌లో ఖాతా తెరిచి ప్రీ క్వార్టర్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటే… వరుసగా రెండో పరాజయం చవిచూసిన ఖతార్‌ ఇంటిబాట పట్టింది. దాంతో… ఆ జట్టు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో నామమాత్రమైన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుతో తలపడుతుంది… ఖతార్.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×