BigTV English

RCB vs MI Final : RCB గెలవాలంటే MI ఫైనల్ చేరొద్దు : అశ్విన్

RCB vs MI Final : RCB గెలవాలంటే MI ఫైనల్ చేరొద్దు : అశ్విన్

RCB vs MI Final :  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు  పంజాబ్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. పంజాబ్ జట్టు  మాత్రం… ముంబై-గుజరాత్ లో జట్లలో విజయం సాధించిన జట్టుతో తలపడనుంది. ఇందులో విజయం సాధించినటువంటి జట్టు ఫైనల్ కి చేరుకుంటుంది. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్ కి చేరుకోవడంతో ఈ సీజన్ లో ఆర్సీబీ నే విజయం సాధిస్తుందనే ధీమాతో అభిమానులు, పలువురు క్రికెటర్లు పేర్కొంటున్నారు.అయితే 2025లో భాగంగా  తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తొమ్మిదేళ్ల తరువాత ఫైనల్ బెర్త్ ఖరారు అయింది. ఐపీఎల్ లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. గడిచిన మూడు సందర్బాల్లో కూడా ఆర్సీబీ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవడం విశేషం.


ముంబై ఇండియన్స్ ఫైనల్ కి రావద్దు.. 

2009లో డెక్కెన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటబి చెందింది ఆర్సీబీ. అలాగే 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి చెందింది. 2016లో ఆర్సీబీ జట్టు.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు 2025లో ప్రస్తుతం ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీ ఫైనల్ కి చేరుకున్న తరువాత ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ప్రతీ సీజన్ లో ఈ సాలా కప్ నమదే అనే ఆర్సీబీ.. అభిమానులు ఇది ఊపును ఇచ్చే అంశం అనే చెప్పవచ్చు. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు.. ఉబ్బితబ్బి అవుతున్నారు.  ఈ ఒక్క సెంటిమెంట్ చాలు మేము ఈ ఏడాది కప్ కోడతామని. చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.  అయితే టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఆర్‌సీబీ టైటిల్ గెలవాలంటే ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు రావద్దని అభిప్రాయపడ్డాడు.


ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు వస్తే మాత్రం ఆర్‌సీబీకి మరోసారి నిరాశ తప్పదన్నాడు. ‘ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలవాలంటే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబై ఫైనల్లో అడుగు పెట్టకుండా ఉంటేనే.. ఆర్‌సీబీకి విజయం దక్కుతుంది. ఆర్‌సీబీ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. నేను ఆర్‌సీబీ ప్లేయర్‌‌ను అయితే మాత్రం గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ ఆడాలని కోరుకుంటాను. కానీ అనూహ్యంగా ముంబై జట్టు గుజరాత్ ని ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడించింది. రోహిత్ శర్మ, బెయిర్ స్టో మెరుపులు మెరిపించడంతో ముల్లాన్ పూర్ లో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.తొలుత ముంబై 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 80 పరుగులు చేసి పోరాడినా.. అతనికి ఫలితం మాత్రం దక్కలేదు. రోహిత్ శర్మ 50 బంతుల్లో 81 పరుగులు చేశాడు. బెయిర్ స్టో 22 బంతుల్లో 47 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో రాణించాడు. ఇక ముంబై ఫైనల్ లో స్థానం కోసం ఆదివారం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×