Sanju Samson: భారతదేశంలో అత్యంత సంపన్న క్రీడగా పరిగణించబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ సందడి మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతోంది. ఈనెల 22వ తేదీ నుండి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 18వ సీజన్ మే 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆటగాళ్లు క్యాంపులకు చేరుకొని ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యారు.
Also Read: Shane Bond: ఇలాగే ఆడితే… బుమ్రా కెరీర్ క్లోజ్.. డేంజర్ బెల్స్ పంపిన బాండ్!
ఇక రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ {Sanju Samson} కూడా ఈ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజు కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకి అవకాశం ఇస్తే ఐపీఎల్ లో ఒక నిబంధనను మారుస్తానని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వల్లే విదేశీ ఆటగాళ్లతో తమకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని, కానీ ఆకస్మాత్తుగా వాళ్లని జట్టు నుండి దూరం చేయడం బాధాకరమైన విషయం అని ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా జోస్ బట్లర్ ని బాగా మిస్ అవుతున్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
సంజు శాంసన్ {Sanju Samson} మాట్లాడుతూ.. ” ఐపీఎల్ అనేది అత్యున్నత స్థాయిలో ఆడేందుకు, జట్టుకు నాయకత్వం వహించేందుకు అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఆటగాళ్ల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు కూడా ఐపీఎల్ ఎంతగానో దోహదపడుతుంది. నాకు దగ్గరైన స్నేహితులలో జోస్ బట్లర్ కూడా ఒకరు. మేమిద్దరం మూడు సంవత్సరాలపాటు ఒకే జట్టుకు కలిసి ఆడాం. ఇద్దరం కలిసి ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాం.
మేము ఒకరికి ఒకరం బాగా తెలుసు. ఎల్లప్పుడూ టచ్ లో ఉంటాం. బట్లర్ నాకు సోదరుడి లాంటివారు. నేను కెప్టెన్ అయ్యాక అతడు జట్టుకి వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. నేను జట్టును నడిపించడంలో అతడు నాకు చాలా సహాయపడ్డాడు. కానీ అతడిని జట్టు నుండి రిలీజ్ చేయడం అనేది సవాల్ తో కూడుకున్న నిర్ణయం. కానీ తప్పలేదు. ఐపీఎల్ లో నాకు ఏదైనా నచ్చని విషయం ఉందంటే అది ఇదే.
ఐపీఎల్ లో నాకు ఏదైనా నిబంధనను మార్చే అవకాశం వస్తే.. ఆటగాళ్లను జట్టు నుండి రిలీజ్ చేసే నియమాన్ని మారుస్తాను. ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ నిబంధన వల్ల సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఎన్నో ఏళ్లుగా ఆటగాళ్లతో ఏర్పర్చుకున్న అనుబంధాలను కోల్పోతాం. ఇది నాకు ఒక్కడికే కాదు.. ఫ్రాంచైజీ, యాజమాన్యం, కోచ్ లు, రాజస్థాన్ రాయల్స్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని వాదించే విషయం. బట్లర్ మా కుటుంబంలో ఒకరు” అని చెప్పుకొచ్చారు శాంసన్.
ఇక బట్లర్ 2018 నుండి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ కి ప్రతినిథ్యం వహించాడు. ఓపెనర్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఎన్నో సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక అతడిని 2025 మెగా వేళానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయగా.. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ. 15.75 కోట్లకు దక్కించుకుంది.