BigTV English

Rahul Tripathi emotional tears: రాహుల్ కంటతడి.. మరో ఛాన్స్ ఉందంటూ..

Rahul Tripathi emotional tears: రాహుల్ కంటతడి.. మరో ఛాన్స్ ఉందంటూ..

Rahul Tripathi emotional tears: అహ్మదాబాద్ వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.  హైదరాబాద్ జట్టు ఆటగాడు రాహుల్ త్రిపాఠి అనుకోకుండా రనౌట్ అయ్యాడు. ఈ పరిణామంతో సన్ రైజర్స్ ఆటగాళ్లు షాకయ్యారు. కాకపోతే రనౌట్ అయిన విధానం నుంచి ఆయన తేరుకున్నట్లు లేదు.


మైదానం నుంచి అతి కష్టంమీద బయటకు వచ్చాడు. అయినా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లకుండా మెట్ల మీద అలా కూర్చుండిపోయాడు. తన ముఖాన్ని ఎవరికీ చూపించలేకపోయాడు. ఆ సమయంలో రాహుల్ కంటతడి పెట్టుకున్నాడు. ఆ సన్నివేశానికి సంబంధించి ఫోటో, వీడియో వైరల్ అయ్యింది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు క్యాప్షన్ ఇచ్చేశారు.

ఆదిలో వికెట్లు పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు రాహుల్ త్రిపాఠి. వరుసగా వికెట్లు పడిపోతున్నా ఒంటరిపోరాటం చేశాడు. అద్బుతంగా ఆడిన తాను అనూహ్య రీతిలో రనౌట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. హైదరాబాద్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే అందుకు రాహుల్ కారణమన్నది అభిమానుల మాట.


ALSO READ: కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ తడ’బ్యాటు’.. 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా..

కొద్దిసేపటికి మిగతా ఆటగాళ్లు రాహుల్‌ని ఓదార్చారు. మ్యాచ్‌లో గెలుపు ఓటములు సహజం అంటూనే, మనకు మరోసారి అవకాశముందని ఆటగాడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి కాసేపటి తర్వాత తేరుకున్న రాహుల్, అక్కడి నుంచి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ కమ్మిన్స్, ఓటమిని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తామన్నాడు. మాకు మరో ఛాన్స్ ఉందన్నాడు. ఈసారి మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తామన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించలేకపోయామన్నాడు. తాము వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందని, కోల్‌కతా జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. తొలుత పిచ్ బౌలర్లకు అనుకూలించిందని, తర్వాత బ్యాటింగ్‌కు సహకరించిందన్నాడు కమ్మిన్స్.

Tags

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×