E-Paper
Advertisement

IND VS PAK: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం టెన్ష‌న్‌…తెర‌పైకి రిజ‌ర్వ్ డే, క‌చ్చితంగా ఆడాల్సిందే

IND VS PAK: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం టెన్ష‌న్‌…తెర‌పైకి రిజ‌ర్వ్ డే, క‌చ్చితంగా ఆడాల్సిందే
Advertisement

IND VS PAK:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. శివరాత్రి రోజున రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు కూడా విక్రయించబడ్డాయి. అభిమానులు అందరూ కొలంబో చేరుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కు వరుణుడు విలన్ గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ జరగకుండా వర్షం ముప్పు ఉన్నట్లు చెబుతున్నారు. శివరాత్రి రోజున అంటే రేపు కొలంబోలో 90% వర్షపాతం నమోదు అయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదే జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు లేనట్లే అని అంటున్నారు.

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు

Advertisement

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పుగా మారినట్లు చెబుతున్నారు. రేపు మ్యాచ్ 7:00కు ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి వాతావరణం అనుకూలించే అవకాశాలు లేనట్టే అని చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 80 నుంచి 95% రేపు సాయంత్రం ఏడు గంటల సమయంలో కొలంబోలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయట. ఈ ఎఫెక్ట్ ప్రేమ దాస స్టేడియం దగ్గర కూడా ఉండే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడునున్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రిజర్వుడే ?

శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం గండంగా మారిన సంగతి తెలిసిందే. అయితే రేపు మ్యాచ్ ప్రారంభానికి వర్షం పడి… విధ్వంసం సృష్టిస్తే ఐసీసీ ప్లాన్ B సిద్ధం చేసిందట. శివరాత్రి రోజు అసలు మ్యాచ్ జరగకుండా వర్షం పడితే.. రిజర్వుడే పెట్టేందుకు సిద్ధమైందట ఐసీసీ. ఇదే జరిగితే, ఫిబ్రవరి 16వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అదే స్టేడియం వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 16వ తేదీన కూడా మ్యాచ్ జరగలేని పరిస్థితి ఉంటే దాదాపు 300 కోట్ల నష్టం ఐసీసీకి జరిగే ప్రమాదం ఉందట. అటు మ్యాచ్ రద్దు అయితే చెరొక పాయింట్ దక్కనుంది. దీంతో ఈ రెండు జట్లు కచ్చితంగా సూపర్ 8 లోకి దూసుకు వెళ్తాయి.

Advertisement

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×