BigTV English

RR Vs MI Preview: నెంబర్ వన్ తో హార్దిక్ నిలుస్తాడా..? నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్!

RR Vs MI Preview: నెంబర్ వన్ తో హార్దిక్ నిలుస్తాడా..? నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్!

IPL 38th Match  – RR Vs MI Dream11 Prediction: ఐపీఎల్ సీజన్ 2024 అంతా ముంబై ఇండియన్స్ మీదే నడిచినట్టుగా ఉంది. కెప్టెన్ మార్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఇక ఓడిపోతూ, గెలుస్తూ పడుతూ లేస్తూ వెళుతున్న ముంబయి  ఆటతీరుపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ రాత్రి 7.30కి జైపూర్ లో జరగనుంది.

ప్రస్తుతం 7 మ్యాచ్ లు ఆడి 6 గెలిచి, ఒకటి ఓడిన రాజస్థాన్ టాప్ లో ఉంది. ముంబయి ఇండియన్స్ అయితే 7 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి 4 ఓడి, పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.


ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 29 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో 15 ముంబయి గెలిస్తే, 13 రాజస్థాన్ గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు.

Also Read: చచ్చీ చెడి గెలిచిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో మరో ఓటమి..

రాజస్థాన్ విషయానికి వస్తే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగు, ఫీల్డింగ్ లో కూడా పటిష్టంగా ఉంది. అంతేకాదు అంతా సమతూకంగా ఉండటంతో ఒకరు కాకపోతే ఒకరు ఆదుకుంటున్నారు. సందర్భానికి తగినట్టుగా ఆడుతున్నారు. ఒకవేళ బ్యాటింగులో విఫలమైతే బౌలర్లు ఆదుకుంటున్నారు. ఇలా ఒక టీమ్ వర్క్ గా ముందడుగు వేస్తోంది.

యశస్వి జైశ్వాల్ ఇంకా టచ్ లోకి రాలేదు. నెమ్మదిగా లయ అందుకుంటున్నాడు. సరిగ్గా నాకౌట్ కి వచ్చేసరికి మనవాడు రెడీ అయ్యేలా ఉన్నాడు. జాస్ బట్లర్, రవిచంద్ర అశ్విన్,  కెప్టెన్ సంజు శాంసన్ , రియాన్ పరాగ్, హెట్ మెయిర్ వీరందరూ సూపర్ గా ఆడుతున్నారు.

బౌలింగుకి వస్తే ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్ వీరంతా ఇరగదీస్తున్నారు. ముంబయి జట్టులో రోహిత్ శర్మ మళ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తను టచ్ లోకి వస్తే ఆకాశమే హద్దుగా ఉంటుంది. బుమ్రా బౌలింగుతో నిప్పులు చెరుగుతున్నాడు. హార్దిక్ సరిగ్గా తనని వాడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: RCB Playoff Chances 2024: ఇక ఆర్సీబీ ఇంటికే.. ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయినట్టే!

ఇక ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కొయెట్జీ అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇక బౌలింగులో హార్దిక్ పాండ్యా, శామ్స్ ములాని, పియూష్ చావ్లా, నమన్ ధీర్ వీరందరూ ఆకట్టుకుంటున్నారు.

ఈ దెబ్బతో ముంబయి ఇండియన్స్ ఆటతీరు ఎలా ఉందో చెప్పడానికి సరైన సమ ఉజ్జీ రాజస్థాన్ అని అందరూ అంటున్నారు. అంతర్గతంగా కొట్టుకు చస్తున్న ముంబయి ఈరోజు ఎలా ఆడతుందో వేచి చూడాల్సిందే.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×