BigTV English

IPL : శాంసన్ , హెట్ మయర్ విధ్వంసం.. రాజస్థాన్ ఘన విజయం..

IPL : శాంసన్ , హెట్ మయర్ విధ్వంసం.. రాజస్థాన్ ఘన విజయం..

IPL : గుజరాత్ కు రాజస్థాన్ షాకిచ్చింది. కెప్టెన్ సంజు శాంసన్ , హెట్ మయర్ విధ్వంసంతో రాయల్స్ జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ ( 45), డేవిడ్ మిల్లర్ ( 46) రాణించారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (28), అభినవ్ మనోహర్ (27), సాయి సుదర్శన్ (20) ఫర్వాలేదనిపించారు. దీంతో గుజరాత్ భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ , ఆడమ్ జంపా, చాహల్ తలో వికెట్ తీశారు.


178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జైశ్వాల్ (1) బట్లర్ (0) వెంటవెంటనే అవుట్ కావడంతో 4 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. పడిక్కల్ (26) కాసేపు మెరుపులు మెరిపించాడు.మరో వైపు కెప్టెన్ సంజు శాంసన్ క్రీజులో ఉన్నాడు. పడిక్కల్, రియాన్ పరాగ్ (5) అవుట్ కావడంతో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. కానీ శాంసన్ హాఫ్ సెంచరీ ( 60, 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులు) బాదడంతో విజయంపై ఆశలు చిగురించాయి.

శాంసన్ అవుటైనా తర్వాత హెట్ మయర్ ( 56 నాటౌట్, 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) రెచ్చిపోయాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. షమీ వేసిన 19 ఓవర్ లో రెండు వికెట్లు పడినా 16 పరుగులు వచ్చాయి. దీంతో గెలుపునకు చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరంకాగా..తొలి బంతికి 2 పరుగులు తీసిన హెట్ మయర్ రెండో బంతికి సిక్సు కొట్టి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. హెట్ మయర్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ కు 2 వికెట్లు, హార్ధిక్ పాండ్యా, నూర్ అహ్మద్ కు తలో వికెట్ దక్కాయి.


ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రాయల్స్ టాప్ ప్లేస్ కు వెళ్లింది. ఆ జట్టు 5 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ లో ఓడింది. గుజరాత్ 5 మ్యాచ్ ల్లో రెండో పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టు 3 మ్యాచ్ ల్లో గెలిచింది. ప్రస్తుతం గుజరాత్ మూడో స్థానంలో ఉంది.

Related News

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Tilak Verma : త‌మ్ముడు తిల‌క్‌…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ

Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Big Stories

×