BigTV English

BCCI : బై.. బై.. రోజర్… బీసీసీఐకి కొత్త బాస్!

BCCI : బై.. బై.. రోజర్… బీసీసీఐకి కొత్త బాస్!

BCCI :  బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్ని నేటితో 70 సంవత్సరాలు పడటంతో సందర్భంగా ఆయన ఆ పదవీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 1983లో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు బిన్ని. 2022లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే బోర్డు రాజ్యాంగం ప్రకారం.. 70 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత ఏ వ్యక్తి కూడా పదవీని చేపట్టలేరు.  బీసీసీఐ అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు.. అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడు  బాధ్యతలు నిర్వర్తిస్తారరు. అంటే బిన్నీ నిష్క్రమణ తరువాత ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


Also Read :  ms dhoni : రహస్య పూజలు చేస్తున్న ధోని దంపతులు.. కొడుకు పుట్టాలని!

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా..


అపెక్స్ కౌన్సిల్ జనరల్ బాడీ ద్వారా అధికారం పొందే విధులను ఉపాధ్యక్షుడు కూడా నిర్వర్తించాలని బోర్డు నియమాలు ఇంకా పేర్కొంటున్నాయి. ఒకవేళ శుక్లా బీసీసీఐ తాత్కాలిక అద్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే.. సెప్టెంబర్ వరకు ఆయన ఆ పదవీలో కొనసాగే అవకాశం ఉందని బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తదుపరి ఆఫీస్ బేరర్లకు ఎన్నికలు జరిగే వరకు ఆయన కొనసాగే అవకాశం ఉందని ఐఏఎన్ఎస్ కి సమాచారం అందింది. బిన్ని 1979 నుంచి 1987 వరకు క్రికెట్ ఆడారు. ఇందులో 27 టెస్టులు, 72 వన్డేలు ఆడాడు. అతను సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్నాడు. శ్రీలంకలో 2000 U19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకున్నప్పుడు ప్రధాన కోచ్ గా పని చేశాడు. ఇక బిన్ని బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మహిళల ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ప్రారంభించారు.

రోజర్ హయాంలో రెండు ఐసీసీ  ట్రోఫీలు.. 

అదేవిధంగా భారత పురుషుల జట్టు 2024 టీ-20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఈ ట్రోఫీలను గెలుచుకోవడంతో అతని ఖాతాలో కీలక విజయాలున్నాయి. బిన్నీ నాయకత్వంలో జాతీయ విధుల్లో లేనప్పుడు క్రీడాకారులు దేశీయ క్రికెట్ పాల్గొనే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ శుక్లా అత్యంత అనుభవజ్ఞుడైన క్రికెట్ నిర్వహాకుడు. ఆయన 2011 నుంచి 2017 వరకు కూడా ఐపీెల్ కమిషనర్ గా పని చేశారు. 2020లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు అయ్యారు. 2022లో ఆ పదవీకి తిరిగి ఎన్నికయ్యాడు. ప్రస్తుతం రోజర్ తరువాత ఆయన బీసీసీఐ అధ్యక్షుడుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ లో పర్యటించిన సమయంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇంగ్లాండ్ రాజు ఛార్లెస్ III ని కలిశాడు. ఇతనితో పాటు టీమిండియా పురుషుల జట్టు, మహిళల జట్టు కూడా ఛార్లెస్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా 5 టెస్టు సిరీస్ మ్యాచ్ లు ఆడుతుంది. ఇప్పటికే 3 పూర్తి కాగా.. వాటిలో 2-1 తేడాతో భారత్ వెనుకంజలో ఉంది. మహిళల జట్టు టీ-20 సిరీస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం వన్డే మ్యాచ్ లు ఆడుతోంది. 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×